కాకతీయ, గీసుగొండ: పోలీసు విధులలో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకుగాను గీసుగొండ సీఐ ఎ.మహేందర్ ఉత్తమ పోలీస్ అవార్డుకి ఎంపిక అయ్యాడు. గురువారం ఖిలా వరంగల్ కుష్ మహల్ లో జరిగిన 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో జిల్లా కలెక్టర్ సత్య శారద, ఈస్ట్ జోన్ డీసీపీ అంకీత్ కుమార్ చేతుల మీదుగా ప్రశంస పత్రాన్ని అందుకున్నారు. అదేవిధంగా గీసుగొండ పోలీస్ స్టేషన్ క్రైం విభాగంలో పనిచేస్తున్న కానిస్టేబుల్ సాయి కుమార్ కి కూడా ఉత్తమ పోలీస్ అవార్డు అందుకున్నారు.


