ఓయూ నుంచి డాక్టరేట్ సాధించిన చుక్క లతకు సన్మానం
బిజెపి రాష్ట్ర నేతలు పుల్లెల పవన్, సొల్లు అజయ్ వర్మ
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ పట్టణం ఉస్మాన్‌పురకు చెందిన చుక్క నరసయ్య పోచమ్మ దంపతుల కుమార్తె చుక్క లత ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పట్టా అందుకున్నారు. ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర నాయకులు, తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర అధ్యక్షులు సొల్లు అజయ్ వర్మ, డాక్టర్ పుల్లెల పవన్ ఆమెను ఘనంగా సన్మానించారు.లత ఉస్మానియా యూనివర్సిటీ సోషియాలజీ విభాగానికి చెందిన ప్రొఫెసర్ సునంద పాండే పర్యవేక్షణలో రిసెర్చ్ స్కాలర్స్ ఆస్పిరేషన్స్, జాబ్ అపోర్చునిటీస్ అండ్ ఎడ్యుకేషనల్ వేస్టేజీ ఎ కంపరేటివ్ స్టడీ ఆఫ్ సెలెక్టెడ్ యూనివర్సిటీస్ ఇన్ ఇండియా అనే అంశంపై పరిశోధన పూర్తి చేశారు.తండ్రి బాల్యంలోనే మరణించగా, తల్లి పోచమ్మ స్వీపర్‌గా పనిచేస్తూ కష్టపడి చదివించిన సంగతి ఈ సందర్భంలో ప్రస్తావనీయమైంది. తల్లి ఆశయాన్ని సాకారం చేసేందుకు చుక్క లత కష్టపడి నాలుగు పీజీ కోర్సులతోపాటు బీఈడీ పూర్తి చేశారు. అనంతరం పీహెచ్డీ కోర్సు పూర్తి చేసే సమయంలో తల్లి క్యాన్సర్ బారినపడి మరణించినా, లత అధైర్యపడకుండా పరిశోధన పూర్తి చేశారు.డాక్టర్ చుక్క లత తన పరిశోధనకు సహకరించిన సోషియాలజీ విభాగ అధ్యాపకులు, మిత్రులకు కృతజ్ఞతలు తెలుపుతూ, తన డాక్టరేట్‌ను తల్లిదండ్రులకు అంకితం చేస్తున్నట్లు తెలిపారు.


