ఘనంగా క్రిస్మస్ వేడుకలు
కాకతీయ, మరిపెడ : మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంతో పాటు మండలంలోని 48 గ్రామాల్లో క్రైస్తవ సోదరులు ఏసుప్రభు జన్మదినాన్ని పురస్కరించుకుని క్రిస్మస్ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు చర్చిలను రంగురంగుల విద్యుత్ దీపాలు, అలంకరణలతో ప్రత్యేకంగా ముస్తాబు చేశారు. చర్చిలలో పాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించగా, క్రైస్తవ కుటుంబాలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నాయి. ఏసుప్రభు బోధనలు ప్రేమ, శాంతి, సోదరభావాన్ని పెంపొందించాలనే సందేశాన్ని అందిస్తున్నాయని పాస్టర్లు పేర్కొన్నారు. గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో, అష్టైశ్వర్యాలతో ఆనందంగా జీవించాలని వారు ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులు, గ్రామవాసులు పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకుంటూ క్రిస్మస్ పండుగను ఉత్సాహంగా జరుపుకున్నారు. ఈ వేడుకల్లో క్రైస్తవ సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


