- ఏసీబీ వలలో రెవెన్యూ సర్వేయర్, అసిస్టెంట్..
- రూ. 20 వేలు లంచం తీసుకుంటుండగా పట్టివేత
- రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘటన
కాకతీయ, కరీంనగర్ బ్యూరో: తన భూమి సర్వే చేసి సర్వే రిపోర్ట్ ఇవ్వడం కోసం బాధితుడిని రూ.30 వేల లంచం డిమాండ్ చేసిన రెవెన్యూ శాఖకు చెందిన సర్వేయర్, అతని అసిస్టెంట్‌ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ కరీంనగర్ డీఎస్పీ పీ విజయ్ కూమార్ కథనం ప్రకారం.. రాజన్న సిరిసిల్ల జిల్లాకి చెందిన ప్రవీన్ చిన్నబోనాలలో తనకు ఉన్న మూడు ఎకరాల భూమిని సర్వే చేయించుకునే క్రమంలో సర్వేయర్ వేణు రూ.30 వేలు లంచం డిమాండ్ చేయగా భాదితుడు ఏసీబీని ఆశ్రయించాడు. సర్వే చేసే సమయంలో బాధితుడు సర్వేయర్ కి రూ.10 వేలు అందించాడు. ఈ క్రమంలోనే మంగళవారం సర్వే రిపోర్ట్ ఇవ్వడం కోసం సర్వేయర్ మడిశెట్టి వేణుగోపాల్ అతని అసిస్టెంట్ సూర్వ వంశీ ద్వారా బాధితుడి నుండి రూ.20 వేలు తీసుకుంటుండగా సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని రెవెన్యూ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడి చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. కాగా పట్టుబడిన అసిస్టెంట్ సూర్య వంశీ నుండి రూ.20 వేలు స్వాధీనం చేసుకున్నారు. లంచం తీసుకుంటూ పట్టుబడిన సర్వేయన్ వేణగోపాల్‌ని, అతని అసిస్టెంట్ సూర్య వంశీ అరెస్ట్ చేసి రేపు కోర్టులో హాజరుపర్చనున్నట్లు తెలిపారు.


