epaper
Saturday, November 15, 2025
epaper

Kondareddypalli: సౌర విద్యుత్ గ్రామంగా ముఖ్యమంత్రి స్వగ్రామం కొండారెడ్డిపల్లి..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: సంపూర్ణ సౌర విద్యుత్ గ్రామంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ రేవంత్ రెడ్డి స్వగ్రామం కొండారెడ్డిపల్లి గుర్తింపు పొందనుంది. నాగర్ కర్నూల్ జిల్లా వంగూర్ మండలంలో అచ్చంపేట నియోజకవర్గం పరిధిలో కొండారెడ్డిపల్లి గ్రామం ఉంది.దేశంలో రెండో గ్రామంగా, దక్షిణ భారతదేశంలో మొదటి గ్రామంగా తీర్చిదిద్దుటకు చేపట్టిన పనులు దాదాపు పూర్తయ్యాయి. TG REDCO ద్వారా రూ 10.53 కోట్లతో 514 ఇండ్లతో , పాటు 11 ప్రభుత్వ భవనాలకు సౌర విద్యుత్ ప్రాజెక్టును ప్రభుత్వం మంజూరు చేసింది. ప్రతి ఇంటికి 3 KW స్థాపిత సామర్ధ్యంతో 480 ఇండ్లకు సౌర విద్యుత్ వసతిని కల్పించారు. అలాగే 60 KW సామర్ధ్యం కలిగిన 11 ప్రభుత్వ భవనాలకు సౌర విద్యుత్ పరికరాలు బిగించారు. మొత్తం సౌర విద్యుత్ ఉత్పత్తి సామర్ధ్యం 1,500 KW ఉన్నది.

మట్టి గోడలతో ఉన్న 34 ఇండ్ల కుటుంబాలు కూడా సౌర విద్యుత్ పరికరాలు ఏర్పాటుకు అనుకూలంగా ఉన్నాయి. ఈ కుటుంబాలకు ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పూర్తయిన వెంటనే, ఇండ్ల పైన సౌర విద్యుత్ పరికరాలు బిగించనున్నట్లు TG REDCO ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మేనేజర్ కె. మనోహర్ రెడ్డి తెలిపారు.

కొండారెడ్డిపల్లి గ్రామం సౌర విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ. 10.53 కోట్లు . అందులో రూ.7.96 కోట్ల వ్యయంతో సౌర విద్యుత్ పరికరాలు ఏర్పాటుకు కేటాయించారు. సౌర విద్యుత్ కు కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ రూ.3.56 కోట్లు , M/s Premier Energies కంపెనీ నుండి కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) నిధుల నుండి రూ 4.092 కోట్లు భరించారు. మరో రూ 2.59 కోట్లను మౌలిక వసతుల అభివృద్ధికి ఖర్చు చేశారు.

ప్రతి ఇంటి నుండి నెలకు 360 యూనిట్స్ విద్యుత్ ఉత్పత్తి అవుతుంది.(ప్రతి KW కు 120 యూనిట్స్ అవుతుంది) ఇండ్ల నుండి ఉత్పత్తి అయ్యే విద్యుత్ ను , ఇంటి వినియోగానికి పోగా,మిగిలిన విద్యుత్ ను గ్రిడ్ కు అనుసంధానం చేశారు. గ్రిడ్ కు పంపే విద్యుత్ యూనిట్ కు రూ 5.25 చొప్పున చెల్లించుటకు లబ్దిదారులతో విద్యుత్ పంపిణీ సంస్థ ఒప్పందం చేసుకున్నది. సెప్టెంబర్ నెలలో విద్యుత్ గ్రిడ్ కు గ్రామం మొత్తం నుండి సుమారు ఒక లక్ష యూనిట్స్ విద్యుత్ ఎగుమతి అయింది. తద్వారా రూ 5 లక్షలు ఆదాయాన్ని గ్రామస్తులు ఒక నెలలోనే ఆర్జించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్‌లో రేవంత్ జోష్‌

కాంగ్రెస్‌లో రేవంత్ జోష్‌ జూబ్లీహిల్స్ పీఠంపై హ‌స్తం పార్టీ జెండా ఉప ఎన్నిక గెలుపుతో...

హీరో నాగార్జునపై కామెంట్స్ చేస్తూ మంత్రి సురేఖ ట్వీట్…

హీరో నాగార్జునపై కామెంట్స్ చేస్తూ మంత్రి సురేఖ ట్వీట్... https://twitter.com/iamkondasurekha/status/1988313863826379169 కాకతీయ, వరంగల్ సిటీ...

జూబ్లీహిల్స్ హ‌స్త‌గ‌తం

జూబ్లీహిల్స్ హ‌స్త‌గ‌తం ఎగ్జిట్ పోల్స్ వెల్ల‌డించిన స‌ర్వే సంస్థ‌లు అన్నింట్లోనూ అధికార పార్టీకి స్పష్టమైన...

కాంగ్రెస్ పార్టీ దొంగ ఓట్లు వేయాల‌ని చూస్తోంది

https://twitter.com/TeluguScribe/status/1987795147560722497 కాంగ్రెస్ పార్టీ దొంగ ఓట్లు వేయాల‌ని చూస్తోంది ఫేక్ స్లిప్పుల‌ను ఎన్నిక‌ల అధికారికి...

అద్దె చెల్లించలేదు.. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌కు తాళం..!

అద్దె చెల్లించలేదు.. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌కు తాళం..! https://twitter.com/TeluguScribe/status/1987768671163629993 కాక‌తీయ‌, వెబ్‌డెస్క్ : అద్దె చెల్లించకపోవడంతో...

చలి పంజా

చలి పంజా రాష్ట్ర వ్యాప్తంగా పడిపోయిన ఉష్ణోగ్ర‌త‌లు కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో...

రేవంత్ రెడ్డి, బండి సంజయ్ బూత్ బ్రదర్స్

రేవంత్ రెడ్డి, బండి సంజయ్ బూత్ బ్రదర్స్ కాంగ్రెస్, బీజేపీది ఫెవికాల్ బంధం ముఖ్యమంత్రి...

కేటీఆర్ బ‌క్వాస్‌..

కేటీఆర్ బ‌క్వాస్‌.. ఆయ‌న మాట‌లు న‌మ్మొద్దు వ‌చ్చే ఐదేండ్లు రేవంత్ సీఎంగా ఉంటారు న‌వీన్ యాదవ్‌ను...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img