పొన్నాలపల్లెలో ఛత్రపతి శివాజీ విగ్రహం ఆవిష్కరణ
కాకతీయ, గంభీరావుపేట : రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం పొన్నాలపల్లి గ్రామంలో గురువారం ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పొన్నాల మహేష్ ఆధ్వర్యంలో మున్నూరు కాపు రాష్ట్ర అధ్యక్షులు కొండ దేవయ్య, మున్నూరు కాపు జిల్లా అధ్యక్షులు బొప్పా దేవయ్య, బీజేపీ జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి తదితరులు పాల్గొన్నారు. వివిధ గ్రామాల సర్పంచులు పూలమాలలు వేసి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ఛత్రపతి శివాజీ మహారాజ్ హిందూ ధర్మ రక్షణ కోసం జీవితాన్ని అంకితం చేసిన మహావీరుడు అని కొనియాడారు. మొఘల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడి హిందూ ఔన్నత్యాన్ని నిలబెట్టిన మహానుభావుడిగా ఆయన చరిత్రలో నిలిచిపోయారని పేర్కొన్నారు. పొన్నాలపల్లెలో ఆయన విగ్రహ ఆవిష్కరణ జరగడం గర్వకారణమని తెలిపారు. సర్పంచ్ పొన్నాల మహేష్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి కోసం అందరి సహకారం అవసరమని, చిన్న గ్రామమైన పొన్నాలపల్లి ఐక్యంగా ముందుకు సాగాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి పెట్టి కూర సురేష్, ఎంపీడీవో రాజేందర్, ఏపీవో అరుణ, మాజీ జెడ్పిటిసి మల్లు గారి నర్సా గౌడ్, మున్నూరు కాపు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎర్రం మల్లయ్య, దమ్మన్నపేట సర్పంచ్ చంద్రశేఖర్ రెడ్డి, ఎల్లారెడ్డిపేట మాజీ మండల అధ్యక్షులు నంది కిషన్, పెద్ద బోనాల మున్నూరు కాపు అధ్యక్షులు తోట శంకర్ తదితరులు, వివిధ గ్రామాల ఉపసర్పంచులు, వార్డ్ సభ్యులు, గ్రామ ప్రజలు, మహిళలు, బీజేపీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


