దేశంలోనే రిచెస్ట్ సీఎంగా చంద్రబాబు నాయుడు
రూ.30 కోట్ల ఆస్తులతో 7వ స్థానంలో సీఎం రేవంత్ రెడ్డి
రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారిన సీఎంల ఆస్తుల జాబితా
ముఖ్యమంత్రుల ఆస్తుల జాబితా విడుదల చేసిన ఎడిఆర్
కాకతీయ, న్యూఢిల్లీ : దేశంలోని ముఖ్యమంత్రుల ఆస్తుల వివరాలను అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఎ డి ఆర్) తాజాగా విడుదల చేసింది. ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అత్యధిక ఆస్తులు కలిగిన సీఎంగా నిలిచారు. ఆయన వద్ద రూ.931 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు ఎ డి ఆర్ నివేదికలో వెల్లడైంది. ఈ క్రమంలో అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమా ఖండ్ రూ.332 కోట్ల ఆస్తులతో రెండో స్థానంలో ఉన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూ.30 కోట్ల ఆస్తులతో 7వ స్థానంలో నిలిచారు. ఎ డి ఆర్ నివేదిక ప్రకారం, దేశంలోని 30 మంది ముఖ్యమంత్రుల ఆస్తులపై సమగ్ర వివరాలను పరిశీలించి ఈ జాబితాను విడుదల చేశారు. ఇందులో సగటు ముఖ్యమంత్రుల ఆస్తులు సుమారు రూ.34.9 కోట్లు ఉన్నట్లు వెల్లడైంది. ఆస్తుల పరంగా కొందరు సీఎంల వద్ద వందల కోట్ల ఆస్తులు ఉండగా, కొందరు సీఎంలు తక్కువ ఆస్తులతోనే కొనసాగుతున్నారని నివేదిక స్పష్టం చేసింది. ఈ జాబితా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.


