చాంబర్ ఆఫ్ కామర్స్ క్యాలెండర్ ఆవిష్కరణ
కాకతీయ, తొర్రూరు : డివిజన్ కేంద్రంలోని వ్యాపార సంస్థల సంఘం చాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో 2026 సంవత్సరానికి రూపొందించిన నూతన క్యాలెండర్‌ను సంఘ అధ్యక్షుడు మచ్చ సురేష్ ఆధ్వర్యంలో సంఘ సభ్యులు, పాలకవర్గం సమక్షంలో ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు మచ్చ సురేష్ మాట్లాడుతూ, సంఘ శ్రేయస్సు కోసం వ్యాపారస్తులు ఐక్యంగా సహకరించడం అభినందనీయమని అన్నారు. నూతన సంవత్సరంలో వ్యాపారస్తులు, వినియోగదారులు సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షిస్తూ, వ్యాపార అభివృద్ధి దిశగా సంఘం చేపట్టే కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘ ఉపాధ్యక్షులు పెరుమాళ్ల చక్రపాణి, చలువాది సత్యనారాయణ, గంజి విజయపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి తల్లాడ హిరాధర్, కోశాధికారి చిదురాల శ్రీనివాస్, మాజీ అధ్యక్షుడు పంజాల ఉపేందర్‌తో పాటు వివిధ వర్గాల వ్యాపారస్తులు రేగురి శ్రీనివాస్, మచ్చ సుధాకర్, ఇమ్మడి రాంబాబు, తాటికొండ సదాశివరావు, ఉప్పల నాగేశ్వరరావు, దొడ్డ రఘు, చిత్రపు పురుషోత్తం, సోమ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.


