కాకతీయ, గీసుగొండ: అనారోగ్య కారణాల చేత ఇటీవల మృతి చెందిన మృతుడి కుటుంబ సభ్యులను పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పరామర్శించారు. వరంగల్ మహానగర పాలక సంస్థ 16వ డివిజన్ ధర్మారం గ్రామంలో ఇటీవల నాసం సాంబయ్య మృతి చెందగా వారి కుటుంబాన్ని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పరామర్శించారు.
ఈ సందర్భంగా సాంబయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే చల్లా, మృతికి గల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. కుటుంబానికి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు.


