రంజాన్ వేడుకల్లో కుడా చైర్మన్ ఇనుగాల
కాకతీయ, హనుమకొండ : పవిత్ర రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షులు, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి పరకాల పట్టణంలోని ముస్లిం సోదరులకు హృదయపూర్వకంగా ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రంజాన్ పండుగ మానవాళికి శాంతి, ప్రేమ, త్యాగం వంటి గొప్ప విలువలను తెలియజేస్తుందని పేర్కొన్నారు. ముస్లిం సోదరులు నెల రోజుల పాటు భక్తిశ్రద్ధలతో ఆచరించే ఉపవాస దీక్షలు సమాజంలో క్రమశిక్షణను పెంపొందించడమే కాకుండా, పేదలకు చేసే దానధర్మాలు సామాజిక సమానత్వాన్ని బలపరుస్తాయని తెలిపారు.
తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వ నాయకత్వంలో మత సామరస్యం బలంగా కొనసాగుతోందని, ప్రజలంతా ఐక్యంగా పండుగలను జరుపుకోవాలని ఆయన కోరారు. సమాజంలో శాంతి, సౌభాగ్యాలు నెలకొనాలని అల్లాహ్‌ను ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, మత పెద్దలు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.


