సేటస్ ఆటోమోటివ్స్ స్టూడియో ప్రారంభం
నాగ చైతన్య చేతుల మీదుగా ఆవిష్కరణ
కాకతీయ, హైదరాబాద్ : బాబ్ లెదర్ గ్రూప్‌కు చెందిన ప్రీమియం కార్ ఇంటీరియర్ కస్టమైజేషన్ బ్రాండ్ సేటస్ ఆటోమోటివ్స్ హైదరాబాద్ ఇర్రం మంజిల్ కాలనీలో తన లగ్జరీ కార్ ఇంటీరియర్ స్టూడియోను అధికారికంగా ప్రారంభించింది. చెన్నై ఫ్లాగ్‌షిప్ స్టూడియో విజయానంతరం హైదరాబాద్‌లో ప్రారంభించిన ఈ కేంద్రం సంస్థ విస్తరణలో కీలక మైలురాయిగా నిలిచింది. ఈ స్టూడియోను సంస్థ వ్యవస్థాపకుడు అశ్వత్ సురేష్ ప్రారంభించగా, నటుడు నాగ చైతన్య అక్కినేని ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆధునిక వినియోగదారులు పనితీరుతో పాటు సౌకర్యం, ఇంటీరియర్ డిజైన్, వ్యక్తిగతీకరణకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని నాగ చైతన్య అన్నారు. స్టూడియోలో బెస్పోక్ రిక్లైనర్ సీటింగ్ సిస్టమ్స్, ప్రీమియం లెదర్, ఆల్కాంటారా® ఇంటీరియర్స్, స్టీరింగ్ వీల్, డ్యాష్‌బోర్డ్ కస్టమైజేషన్, స్టార్ లైటింగ్ వంటి అంతర్జాతీయ ప్రమాణాల సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇటలీకి చెందిన ఆల్కాంటారా®, రష్యా సంస్థ *మార్టినోవ్ బ్రదర్స్ సీట్స్ (MBS)*తో సాంకేతిక భాగస్వామ్యం సేటస్ ఆటోమోటివ్స్‌కు ప్రత్యేక గుర్తింపును ఇస్తోంది.
ఈ స్టూడియోతో భారతదేశంలో లగ్జరీ ఆటోమోటివ్ ఇంటీరియర్ కస్టమైజేషన్ రంగంలో కొత్త ప్రమాణాలు నెలకొల్పడమే లక్ష్యమని సంస్థ ప్రతినిధులు తెలిపారు.


