కాకతీయ, నర్సింహులపేట: భూపాలపల్లి జిల్లా పంచాయతీరాజ్ డివిజన్ కార్యాలయం లో బిపిఓ పనిచేస్తున్న మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రానికి చెందిన గడ్డి అంజనేయులుకు 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శుక్రవారం ప్రశంస పత్రాన్ని అందుకున్నారు.
జిల్లా ఇన్ ఛార్జ్, ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, జిల్లా కలెక్టర్ భవనేష్ మిశ్రా చేతుల మీదుగా ప్రశంస పత్రాన్ని అందుకున్నారు. ఉత్తమ ఉద్యోగ అవార్డు అందుకోవడంతో మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల ప్రజలు, సహచర ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.


