epaper
Tuesday, March 3, 2026
epaper

వరద నష్టాలపై కేంద్ర బృందం క్షేత్రస్థాయి తనిఖీ

వరద నష్టాలపై కేంద్ర బృందం క్షేత్రస్థాయి తనిఖీ
▪️ మొంథా తుపాన్‌తో హనుమకొండలో తీవ్ర నష్టం
▪️ పంటలు, రోడ్లు, ఇళ్లపై సమగ్ర అంచనాలు
▪️ వరద ముంపు గ్రామాల్లో ప్రత్యక్ష పరిశీలన
▪️ రైతులు, బాధితులతో మాట్లాడిన అధికారులు
▪️ నష్టాల ఫొటో ఎగ్జిబిషన్ పరిశీలన

కాకతీయ, హనుమకొండ : అక్టోబర్ నెలలో మొంథా తుపాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాల కారణంగా హనుమకొండ జిల్లాలో సంభవించిన వరద ముంపు, పంట నష్టం, రోడ్లు కోతకు గురవ్వడం, ఇండ్లు కూలిపోవడం వంటి విస్తృత నష్టాలను అంచనా వేసేందుకు కేంద్ర ప్రభుత్వ అధికారుల బృందం శుక్రవారం జిల్లాలో క్షేత్రస్థాయిలో పర్యటించింది. జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాలను ప్రత్యక్షంగా పరిశీలిస్తూ, నష్టాల తీవ్రతపై వివరాలు సేకరించింది. జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్‌తో కలిసి కేంద్ర బృందం ధర్మసాగర్ మండలం దేవునూరు గ్రామాన్ని సందర్శించి, వరద ధాటికి దెబ్బతిన్న ప్రధాన రహదారిని పరిశీలించింది. ఈ సందర్భంగా రైతులు, స్థానికులతో మాట్లాడిన అధికారులు పంటలకు జరిగిన నష్టం, రహదారుల పరిస్థితి, రాకపోకలకు ఏర్పడిన ఇబ్బందులపై వివరాలు తెలుసుకున్నారు.

పంటలు–రోడ్లకు భారీ దెబ్బ

వరదల కారణంగా పంట పొలాలు ముంపునకు గురైన తీరు, రహదారులు కొట్టుకుపోయిన పరిస్థితులను కేంద్ర బృందం క్షుణ్ణంగా పరిశీలించింది. పంట నష్టాలకు సంబంధించిన ఛాయాచిత్రాల ప్రదర్శనను కూడా అధికారులు పరిశీలించి, నష్టాల తీవ్రతపై అవగాహన పొందారు. అనంతరం దేవునూరు–ముప్పారం గ్రామాల మధ్య ఉన్న లో లెవెల్ బ్రిడ్జి సమీపంలో వరదల వల్ల దెబ్బతిన్న వ్యవసాయ భూములను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

కూలిన ఇళ్లు… బాధితుల వేదన
ముప్పారం గ్రామంలో భారీ వర్షాల కారణంగా తోట కమలమ్మకు చెందిన ఇల్లు కూలిపోవడంతో ఆ ఇంటిని సందర్శించిన కేంద్ర అధికారులు, బాధిత మహిళతో మాట్లాడి నష్టం వివరాలు తెలుసుకున్నారు. అలాగే భీమదేవరపల్లి మండలం విశ్వనాథ కాలనీలో వరదలకు దెబ్బతిన్న కాలువను, కొప్పూరులో వర్షాలకు కూలిన ఇంటిని కూడా పరిశీలించారు. అదేవిధంగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని హనుమకొండ సమ్మయ్య నగర్, గోపాల్‌పూర్ ఊర చెరువు కట్ట, వరద ముంపుకు గురైన అమరావతి నగర్ ప్రాంతాలను జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్‌లతో కలిసి కేంద్ర బృందం సందర్శించింది. వరద ముంపుతో పట్టణ ప్రాంతాల్లో ఎదురైన సమస్యలను అధికారులు అక్కడికక్కడే పరిశీలించారు. ఈ పర్యటనలో జిల్లా అదనపు కలెక్టర్ ఎన్. రవి, హనుమకొండ ఆర్డీఓ రాథోడ్ రమేష్, జిల్లా వ్యవసాయ అధికారి రవీందర్ సింగ్, పంచాయతీరాజ్ ఈఈ ఆత్మారామ్, విద్యుత్ శాఖ ఎస్ఈ మధుసూదన్, ఆర్ & బి అధికారులు గోపీకృష్ణ, ఉదయ్‌తో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. కేంద్ర బృందం సేకరించిన వివరాల ఆధారంగా రాష్ట్రానికి, కేంద్రానికి సమగ్ర నివేదిక అందించనున్నట్లు అధికారులు తెలిపారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాక‌తీయ ఎఫెక్ట్‌..!

కాక‌తీయ ఎఫెక్ట్‌..! కొమ్మాల జాతర ఉత్సవ కమిటీ ఏర్పాటు వీరాటి రవీందర్ రెడ్డి అధ్యక్షుడిగా...

డంపింగ్ యార్డు పొగతో ప్రమాదంలో ప్రజారోగ్యం

డంపింగ్ యార్డు పొగతో ప్రమాదంలో ప్రజారోగ్యం చెత్త దహనంతో గ్రామమంతా విషపూరిత పొగలు గ్రీవెన్స్‌లో...

రోడ్డు భద్రతపై పోలీసుల వినూత్న ప్రచారం

రోడ్డు భద్రతపై పోలీసుల వినూత్న ప్రచారం “అరైవ్ అలైవ్” నినాదంతో అవగాహన కార్యక్రమం హెల్మెట్...

విద్యార్థులకు వాహన సౌకర్యం కల్పించిన వెంకన్న నాయక్

విద్యార్థులకు వాహన సౌకర్యం కల్పించిన వెంకన్న నాయక్ సేవా భావాన్ని అభినందించిన హెచ్ఎం...

కొమ్మాల జాతరపై డేగ కన్ను

కొమ్మాల జాతరపై డేగ కన్ను 360 డిగ్రీల నిఘాతో 100 సీసీ కెమెరాలు ఇద్దరు...

ఏనుమాముల మార్కెట్ లో గలాట!

ఏనుమాముల మార్కెట్ లో గలాట! పోలీసులు, వ్యాపారుల మధ్య వివాదం! మార్కెట్లో...

ఒక రూపాయి… ఒక ప్రపంచం!

ఒక రూపాయి… ఒక ప్రపంచం! కాయిన్ బాక్స్ మోగించిన అనుబంధాల గాథ కాకతీయ, స్పెషల్...

ప్రభ బండి ప్రారంభోత్సవానికి కొండాకు ఆహ్వానం

ప్రభ బండి ప్రారంభోత్సవానికి కొండాకు ఆహ్వానం కొమ్మాల గుట్ట జాతరలో ప్రత్యేక ఆకర్షణగా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img