epaper
Wednesday, January 28, 2026
epaper

జైళ్ల సంస్కరణలపై కేంద్రం స్పెషల్ ఫోకస్!

జైళ్ల సంస్కరణలపై కేంద్రం స్పెషల్ ఫోకస్!
ఆధునీకరణకు రూ.950 కోట్లు
పేద ఖైదీలకు ఏటా రూ.20 కోట్ల మద్దతు
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : దేశవ్యాప్తంగా జైళ్లను కేవలం భద్రతా కేంద్రాలుగానే కాకుండా సంస్కరణ, పునరావాస కేంద్రాలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. జైళ్ల ఆధునీకరణ ప్రాజెక్టు కింద రూ.950 కోట్లు కేటాయించగా, పేద ఖైదీలకు మద్దతు పథకం కింద ఏటా రూ.20 కోట్లు వెచ్చిస్తున్నట్లు వెల్లడించారు. విశాఖపట్నంలోని సాయిప్రియా రిసార్ట్స్‌లో రెండు రోజుల పాటు జరిగిన ‘‘జైలు అధికారుల 9వ జాతీయ సమ్మేళం’’ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన ఈ మేరకు ప్రసంగించారు. ఈ సదస్సును బీపీఆర్ అండ్ డీ ఆంధ్రప్రదేశ్ కారాగారాలు & సవరణ సేవల విభాగం సంయుక్తంగా నిర్వహించాయి.

హైసెక్యూరిటీ జైళ్లు.. ఆధునిక మౌలిక సదుపాయాలు

జైళ్లలో భద్రతా వ్యవస్థను పటిష్టం చేయడమే కాకుండా, హైసెక్యూరిటీ జైళ్ల నిర్మాణం, ఆధునిక సాంకేతికత వినియోగం, మానవీయ వసతుల కల్పనపై కేంద్రం దృష్టి పెట్టిందన్నారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి మాత్రమే రూ.101.45 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఆధార్ ధృవీకరణ, వీడియో కాన్ఫరెన్సింగ్, టెలీమెడిసిన్ వంటి సదుపాయాలతో జైళ్ల నిర్వహణను ఆధునికీకరిస్తున్నామన్నారు. కస్టడీలో ఉండి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద ఖైదీల కోసం అమలులో ఉన్న పేద ఖైదీలకు మద్దతు పథకం ద్వారా ఇప్పటికే 16 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో 237 మంది ఖైదీలకు ఉపశమనం లభించిందని బండి సంజయ్ తెలిపారు. ఈ పథకం ద్వారా న్యాయ సహాయం, పునరావాసానికి దోహదం జరుగుతోందన్నారు.

మోడల్ జైలు విధానాల అమలుపై చర్చలు

ఈ సదస్సులో మోడల్ ప్రిజన్ మాన్యువల్–2016, మోడల్ ప్రిజన్స్ & కరెక్షనల్ సర్వీసెస్ చట్టం–2023, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత సెక్షన్–479 అమలు, ఖైదీల విడుదల అనంతర పునరావాసం వంటి అంశాలపై లోతైన చర్చలు జరగాల్సిన అవసరం ఉందన్నారు. బీపీఆర్ అండ్ డీ ఆధ్వర్యంలో జాతీయ జైలు శిక్షణ విధానం–2025 ద్వారా మానవ హక్కులు, వృత్తి నైపుణ్యాలపై శిక్షణ అందిస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు 701 శిక్షణా కోర్సులు, 15,875 మంది జైలు అధికారులకు శిక్షణ అందించామని వెల్లడించారు. కేంద్రం–రాష్ట్రాల సమన్వయంతో సురక్షితమైన, మానవీయమైన, సంస్కరణాత్మక జైలు వ్యవస్థ నిర్మాణమే లక్ష్యమని, ఈ సదస్సు భవిష్యత్తు పాలసీలకు దిశానిర్దేశం చేయాలని ఆశిస్తున్నట్లు కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

నేడు మేడారంలో మహా జాతర ఆరంభం..!

నేడు మేడారంలో మహా జాతర ఆరంభం..! సారలమ్మ ఆగమనంతో వనదేవతల వేడుకలకు శ్రీకారం తొలిరోజు...

మున్సిపోల్స్‌కు మోగిన న‌గారా

మున్సిపోల్స్‌కు మోగిన న‌గారా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల ఫిబ్రవరి 11న పోలింగ్, 13న కౌంటింగ్ రేప‌టి...

మున్సిపల్ ఎన్నికల నగారా..!

మున్సిపల్ ఎన్నికల నగారా..! నేడు షెడ్యూల్ విడుదలకు రంగం సిద్ధం కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో...

మేడారంలో మెగా వైద్య భద్రతా

మేడారంలో మెగా వైద్య భద్రతా యాభై పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు ముప్పై...

కేటీఆర్‌కు సిగ్గుండాలె

కేటీఆర్‌కు సిగ్గుండాలె ఇప్పుడు సంసారి లెక్క మాట్లాడుతుండు కేసీఆర్ కుటుంబంతో ప్ర‌మాణం చేయాలె టెర్ర‌రిస్ట్ పేరుతో...

రాధాకృష్ణ రాతలు అవాస్తవాలు

రాధాకృష్ణ రాతలు అవాస్తవాలు సింగరేణిపై క‌ల్పిత కట్టు కథనాలు నా వ్యక్తిత్వ హననం చేసేలా...

అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రతా ఉద్యమం

అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రతా ఉద్యమం రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం ఇప్పటివరకు 3,836...

కేస‌ముద్రంలో హోరాహోరీ

కేస‌ముద్రంలో హోరాహోరీ కాంగ్రెస్, బీఆర్ఎస్ మ‌ధ్య ట‌గ్ ఆఫ్ వార్‌ కొత్త‌గా ఏర్ప‌డిన మున్సిపాలిటీ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...
spot_img

Popular Categories

spot_imgspot_img