epaper
Tuesday, December 2, 2025
epaper

స‌ర్‌పై చ‌ర్చ‌కు కేంద్రం ఓకే

స‌ర్‌పై చ‌ర్చ‌కు కేంద్రం ఓకే

రెండో రోజూ ఎస్ఐఆర్‌కు వ్య‌తిరేకంగా పార్ల‌మెంట్ వ‌ద్ద విప‌క్షాల నిర‌స‌న

అఖిలపక్ష సమావేశం ఏర్పాటుచేసిన స్పీక‌ర్ ఓంబిర్లా

ఈనెల 8న వందేమాతరం, 9న ఎన్నికల సంస్కరణలపై లోక్‌సభలో చర్చ

పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు

కాక‌తీయ‌, నేష‌న‌ల్ డెస్క్‌: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్‌)పై చర్చకు కేంద్రం అంగీకరించింది. అయితే ప్రత్యేకంగా ‘సర్’పై కాకుండా ఎన్నికల సంస్కరణలు అనే విస్తృత అంశాన్ని సభ ముందు ఉంచనుంది. ఈమేరకు స్పీకర్ ఓం బిర్లా మంగళవారం మధ్యాహ్నం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో కేంద్రం, విపక్షాల మధ్య అవగాహన కుదిరింది. ఆ ప్రకారం డిసెంబర్ 8న వందేమాతరంపై, 9న ఎన్నికల సంస్కరణలపై లోక్‌సభలో చర్చ జరుగనున్నట్టు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ‘లోక్‌సభ స్పీకర్ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. వందేమాతర గీతం 150 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నందున దానిపై డిసెంబర్ 8 తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి చర్చ జరపాలని సమావేశం నిర్ణయించింది. అలాగే డిసెంబర్ 9 తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఎన్నికల సంస్కరణలపై చర్చ మొదలవుతుంది అని కిరణ్ రిజిజు ‘ఎక్స్’లో తెలిపారు.

10 గంటల పాటు డిబేట్

కాగా, అఖిలపక్ష సమావేశానంతరం మీడియాతో కాంగ్రెస్ విప్ కె.సురేష్ మాట్లాడుతూ.. ఎస్ఆర్ఐ అంశంపై చర్చించాలని విపక్షాలు కోరాయని, ఎస్ఐఆర్‌ను కూడా జతచేసి ఎన్నికల సంస్కరణలపై విస్తృత చర్చకు సమావేశం నిర్ణయించిందని తెలిపారు. సభలో 10 గంటల చొప్పున రెండు డిబేట్లకు సమయం కేటాయించారని, అవసరమైతే సమయం మరింత పొడిగించే అవకాశం ఉంటుందని చెప్పారు.

రెండో రోజూ నిర‌స‌న‌లు

పార్లమెంటు శీతాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమైన విషయం తెలిసిందే. తొలిరోజే సర్‌పై చర్చించాల్సిందేనని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ఈ ఆందోళన మధ్యనే సభ మంగళవారానికి వాయిదా పడింది. అటు రాజ్యసభలోనూ ఇదే అంశంపై చర్చకు విపక్షం పట్టుపట్టింది చివరకు వాకౌట్ చేసింది. చర్చకు ప్రభుత్వం విముఖంకాదని, కాలపరిమితిని నిర్దేశించాలనుకోవడం మాత్రం తగదని అధికారపక్షం పేర్కొంది. రెండో రోజూ సమావేశాల్లోనూ ఇవే అంశాలపై విపక్షాలు ఆందోళనకు దిగడంతో స్పీకర్ అఖిలపక్ష సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఎట్ట‌కేలకు అధికార పక్షం చర్చకు అంగీకరించింది. అయితే ప్రత్యేకంగా సర్‌పై కాకుండా ఎన్నికల సంస్కరణలు అనే విస్తృత అంశాన్ని సభ ముందు ఉంచనున్నట్లు తెలుస్తోంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

పీఎంవో ఆఫీస్ ఇక సేవాతీర్థ్..

పీఎంవో ఆఫీస్ ఇక సేవాతీర్థ్.. పేరు మార్చుతూ కేంద్రం నిర్ణయం కొత్త భవనంలోకి మారనున్న...

“ వెడ్ ఇన్ ఇండియా“.. మోడీ పిలుపుతో ఆ ప్రాంతాల‌కు బిగ్ హైప్‌!

`` వెడ్ ఇన్ ఇండియా``.. మోడీ పిలుపుతో ఆ ప్రాంతాల‌కు బిగ్...

మధ్యప్రదేశ్ సీఎం సింప్లిసిటీకి సలాం..

మధ్యప్రదేశ్ సీఎం సింప్లిసిటీకి సలాం.. టాక్ ఆఫ్ ది టౌన్‌గా కుమారుడి...

గ్రీన్ కార్డ్ హోల్డర్లకు బిగ్ షాక్‌.. రీ-వెరిఫికేషన్‌కు ట్రంప్ ఆదేశం!

గ్రీన్ కార్డ్ హోల్డర్లకు బిగ్ షాక్‌.. రీ-వెరిఫికేషన్‌కు ట్రంప్ ఆదేశం! వైట్‌హౌస్ కాల్పుల...

భారత్‌తో నేపాల్ క‌య్యం.. వివాదాస్పదంగా రూ. 100 నోటు!

భారత్‌తో నేపాల్ క‌య్యం.. వివాదాస్పదంగా రూ. 100 నోటు! మ‌ళ్లీ ర‌గిలిన సరిహద్దు...

హాంకాంగ్‌లో అగ్ని తుఫాన్.. 44 మంది మృతి, వందల మంది గల్లంతు!

హాంకాంగ్‌లో అగ్ని తుఫాన్.. 44 మంది మృతి, వందల మంది గల్లంతు! హాంకాంగ్...

కారు బాంబు కుట్రలో కొత్త మలుపు.. షాహిన్–ముజమ్మిల్ భార్యాభర్తలే!

కారు బాంబు కుట్రలో కొత్త మలుపు.. షాహిన్–ముజమ్మిల్ భార్యాభర్తలే! ఢిల్లీ కారు బ్లాస్ట్‌...

అనుకోని అదృష్టం.. రూ.81 కోట్లకు అమ్ముడైన‌ పాత కామిక్ బుక్‌!

అనుకోని అదృష్టం.. రూ.81 కోట్లకు అమ్ముడైన‌ పాత కామిక్ బుక్‌! శాన్‌ఫ్రాన్సిస్కో సంచలనం తల్లి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img