‘లయన్స్’ ఆధ్వర్యంలో సిమెంట్ బెంచీలు
కాకతీయ, కరీంనగర్: ‘లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్’ బాలాజీ నగర్, లయన్స్ క్లబ్ ఆఫ్ శ్రీనిధి ఆధ్వర్యంలో ఆదివారం పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జైలులో ఖైదీలను సందర్శించడానికి వచ్చే వారి సౌకర్యార్థం 10 సిమెంట్ బెంచ్‌లను ఏర్పాటు చేసినట్లు జిల్లా గవర్నర్ లయన్ ఎస్. కొడందరామ్ తెలిపారు. అదేవిధంగా లయన్స్ డయాగ్నస్టిక్ సెంటర్ ద్వారా ఖైదీలకు షుగర్, బీపీ పరీక్షలు నిర్వహించామన్నారు. అనంతరం క్యాన్సర్ పై ఖైదీలకు అవగాహన కల్పించి కరపత్రాలు విడుదల చేసి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి డీఎస్పీ సుధాకర్ రెడ్డి హాజరై లయన్స్ బాధ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు లయన్ రవీందర్ రెడ్డి, లయన్ కుమార్ రెడ్డి, ఐపీఎంసీసీ లయన్ హన్మండ్ల రాజి రెడ్డి, కోఆర్డినేటర్ లయన్ రాధాకృష్ణ రెడ్డి ఇతర సభ్యులు పాల్గొన్నారు.


