యాభై వేల మాస్కులు అందించిన సీసీఎస్ పోలీసులు
కాకతీయ, హనుమకొండ : వచ్చే వారంలో ప్రారంభం కానున్న మేడారం సమ్మక్క సారలమ్మ జాతర సందర్బంగా విధులు నిర్వహించేందుకు తరలి వెళ్ళే పోలీస్ అధికారులు, సిబ్బంది కోసం ఉమ్మడి వరంగల్ జిల్లా కేంద్ర డ్రగ్స్ ఔషధ గిడ్డంగుల విభాగం సహకారంతో సేకరించిన యాభై వేల మాస్కులను సిసిఎస్ వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ కు అందజేశారు. ఈ సందర్బంగా సీపీ మాట్లాడుతూ.. ప్రధానంగా రోడ్డు మార్గంలో విధులు నిర్వహించే పోలీసులు తప్పని సరిగా మాస్క్ లు ధరించే విధంగా పోలీస్ అధికారులు చొరవ చూపాలని సీపీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీసీపీలు కవిత, అంకిత్ కుమార్, అదనపు డీసీపీలు, బాలస్వామి, ప్రభాకర్ రావు, ఉమ్మడి వరంగల్ జిల్లా కేంద్ర డ్రగ్స్ ఔషధ గిడ్డంగుల ఇంచార్జి డా. భాస్కర్ రావు ఏసీపీలు సదయ్య, జాన్ నర్సింహులు, సురేంద్ర, ప్రశాంత్ రెడ్డి, సత్యనారాయణ, సిసిఎస్, పర్వతగిరి ఇన్స్ స్పెక్టర్లు రాఘవేందర్, రాజగోపాల్ పాల్గొన్నారు.


