కాకతీయ, కరీంనగర్: జిల్లాలోని ఆరు జిన్నింగ్ మిల్లుల్లో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఆధ్వర్యంలో పత్తి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయని అధికారులు తెలిపారు. ఈ కేంద్రాలు శక్తి మురుగన్ ఇండస్ట్రీస్ (ఎలబోతారం), వైభవ్ కాటన్ కార్పొరేషన్ – సి/ఓ ఆదిత్య కాటన్ ఆయిల్ ఆగ్రో టెక్ ఇండస్ట్రీస్ (జమ్మికుంట), నరసింహ కాటన్ జిన్నింగ్, ప్రెస్సింగ్ (జమ్మికుంట), సరిత కాటన్ ఇండస్ట్రీస్ (జమ్మికుంట), సీతారామ కాటన్ ఇండస్ట్రీస్ (జమ్మికుంట), కావేరి జిన్నింగ్ మిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ (వెలిచాల) లో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రైతులు పత్తి విక్రయానికి ముందు ‘కాపాస్ కిసాన్’ యాప్ ద్వారా స్లాట్ బుకింగ్ చేసుకోవాలని సూచించారు. పూర్తిగా ఎండిన పత్తినే కేంద్రాలకు తీసుకురావాలని, పత్తిలో తేమ శాతం 8% మించకూడదని అధికారులు తెలిపారు.


