కాకతీయ, తెలంగాణ బ్యూరో: సిబిఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ ఆకస్మికంగా అస్వస్థతకు గురయ్యారు. ఆయన శ్రీశైలం దేవస్థానం దర్శనం ముగించుకుని హైదరాబాద్‌కు వస్తుండగా గుండెపోటు లక్షణాలు కనిపించడంతో వెంటనే జూబ్లీహిల్స్‌లోని ఒక ప్రైవేట్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు అక్కడ వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
ప్రవీణ్ సూద్ కుటుంబ సభ్యులతో కలిసి శ్రీశైలం మల్లికార్జున స్వామి, భ్రమరాంబ అమ్మవారి ఆలయ దర్శనం చేశారు. తిరుగు ప్రయాణంలో వాహనంలో ఉండగానే ఆయనకు అస్వస్థత అనిపించినట్లు తెలుస్తోంది. దగ్గరలోని వైద్య సిబ్బంది ప్రాథమిక చికిత్స చేసినప్పటికీ పరిస్థితి సరిగా లేకపోవడంతో వెంటనే హైదరాబాద్‌కు తరలించారు. జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రి వైద్యులు మీడియాకు వెల్లడించిన ప్రకారం, ప్రవీణ్ సూద్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు తెలిపారు.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ప్రవీణ్ సూద్ కర్ణాటక కేడర్‌కు చెందిన 1986 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ఆయన 2023 మేలో సీబీఐ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు కర్ణాటక రాష్ట్ర పోలీస్ చీఫ్‌గా పనిచేశారు. తన క్రమశిక్షణ, నిజాయితీ, కఠిన నిర్ణయాల వల్ల దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు పొందారు


