epaper
Monday, March 2, 2026
epaper

అమెరికా విడిచి వెళ్తే క్యాష్‌ + ఫ్రీ ఫ్లైట్!

అమెరికా విడిచి వెళ్తే క్యాష్‌ + ఫ్రీ ఫ్లైట్!
అక్రమ వలసదారులకు ట్రంప్‌ బంపర్‌ ఆఫర్‌
స్వచ్ఛందంగా వెళ్తే రూ.2.7 లక్షలు నగదు
‘సీబీపీ హోమ్‌’ యాప్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌
వినకపోతే అరెస్ట్‌, జీవితాంతం నో ఎంట్రీ

కాకతీయ‌, నేషనల్‌ డెస్క్‌ : అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వలసదారులపై ట్రంప్‌ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో మిగిలితే అరెస్టులు, డిపోర్టేషన్లు.. స్వచ్ఛందంగా వెళ్తే మాత్రం నగదు, ఉచిత విమాన ప్రయాణం! ఇదే వాషింగ్టన్‌ నుంచి వచ్చిన స్పష్టమైన హెచ్చరిక. డిసెంబర్‌ 22న హోంల్యాండ్‌ సెక్యూరిటీ విభాగం (డీహెచ్‌ఎస్‌) చేసిన ప్రకటన ప్రకారం.. ఈ ఏడాది చివరిలోగా స్వచ్ఛందంగా అమెరికాను విడిచి స్వదేశాలకు తిరిగివెళ్లే అక్రమ వలసదారులకు 3,000 డాలర్లు (సుమారు రూ.2.7 లక్షలు) నగదుతో పాటు ఉచిత విమాన టికెట్‌ను అందించనుంది. గతంలో మే నెలలో 1,000 డాలర్లుగా ఉన్న ఈ ప్రోత్సాహకాన్ని క్రిస్మస్‌ సీజన్‌ సందర్భంగా మూడు రెట్లు పెంచడం గమనార్హం.

యాప్‌ ద్వారా నమోదు తప్పనిసరి
ఈ పథకాన్ని పొందాలంటే వలసదారులు ‘సీబీపీ హోమ్‌’ అనే మొబైల్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసి తమ వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్‌ పూర్తయిన అనంతరం ప్రయాణానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను అమెరికా ప్రభుత్వమే చేపడుతుందని డీహెచ్‌ఎస్‌ స్పష్టం చేసింది. విమాన టికెట్‌ నుంచి స్వదేశానికి చేరే వరకూ పూర్తి బాధ్యత ప్రభుత్వానిదేనని తెలిపింది. ఈ పథకంలో చేరే వారికి మరో భారీ ఊరట కూడా ఉంది. అక్రమంగా అమెరికాలో నివసించినందుకు విధించిన సివిల్‌ జరిమానాలను పూర్తిగా రద్దు చేస్తామని డీహెచ్‌ఎస్‌ ప్రకటించింది. అంటే స్వచ్ఛందంగా వెళ్తే నగదు అందడమే కాకుండా లీగల్‌ సమస్యల నుంచి కూడా విముక్తి లభించనుంది. పండుగ సీజన్‌లో అక్రమ వలసదారులు తమకు, తమ కుటుంబాలకు ఇవ్వగల అత్యుత్తమ బహుమతి ఇదేనని డీహెచ్‌ఎస్‌ వ్యాఖ్యానించింది.

వినకపోతే కఠిన చర్యలు
అయితే ఈ ఆఫర్‌ను పట్టించుకోని వారిపై కఠిన చర్యలు తప్పవని ట్రంప్‌ ప్రభుత్వం హెచ్చరించింది. హోంల్యాండ్‌ సెక్యూరిటీ కార్యదర్శి క్రిస్టీ నోయెమ్‌ మాట్లాడుతూ.. ఈ అవకాశాన్ని వినియోగించుకోని వారిని గుర్తించి అరెస్ట్‌ చేసి దేశం నుంచి బహిష్కరిస్తామని స్పష్టం చేశారు. అలాంటి వారు తిరిగి అమెరికాలోకి అడుగుపెట్టే అవకాశం ఉండదని తేల్చిచెప్పారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు సుమారు 1.9 మిలియన్ల మంది అక్రమ వలసదారులు స్వచ్ఛందంగా అమెరికాను విడిచిపోయారని ఆమె వెల్లడించారు. ఇప్పటికే వేలాది మంది ‘సీబీపీ హోమ్‌’ యాప్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ చేసుకుని ఈ అవకాశాన్ని వినియోగించుకుంటున్నట్లు తెలిపారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రూ.1000 దాటితే యూపీఐపై ఛార్జీలు?.. ఎన్‌పీసీఐ క్లారిటీ

రూ.1000 దాటితే యూపీఐపై ఛార్జీలు?.. ఎన్‌పీసీఐ క్లారిటీ సాధారణ యూపీఐ లావాదేవీలపై ఎలాంటి...

బెంగళూరు ‘లేడీ డాన్’ యశస్వినీ గౌడ అరెస్ట్

బెంగళూరు ‘లేడీ డాన్’ యశస్వినీ గౌడ అరెస్ట్ రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్...

ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం

ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం వారంలోగా అమ‌ల్లోకి.. మూడునాలుగు రోజుల్లోనే సంతకాలు భారత్‌-అమెరికా సంయుక్త...

మీకు ఏది సరైనదనిపిస్తే అదే చేయండి

మీకు ఏది సరైనదనిపిస్తే అదే చేయండి కీలక ప్రశ్నలకు మోదీ సమాధానం ఇవ్వలేదు ప్ర‌ధాని...

మద్రాస్ హైకోర్టులో విజయ్‌కు షాక్‌

మద్రాస్ హైకోర్టులో విజయ్‌కు షాక్‌ రూ.1.50 కోట్ల పెనాల్టీ చెల్లించాల్సిందేన‌న్న న్యాయ‌స్థానం భారీ జరిమానాను...

పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి

పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి 31 మంది మృతి.. 170 మందికి గాయాలు క్ష‌త‌గాత్రుల్లో ప‌లువురి...

విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మృతి

విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మృతి ల్యాండ్ అవుతుండ‌గా రన్‌వేపై కుప్ప‌కూలిన చార్టర్డ్...

కర్తవ్యపథ్‌పై గర్వభారతం!

కర్తవ్యపథ్‌పై గర్వభారతం! డెబ్బై ఏడవ గణతంత్ర వేడుకలు ఘనంగా ప్రారంభం రాజ్యాంగ ఆత్మకు ప్రతీకగా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img