కాకతీయ, మహబూబాబాద్: డోర్నకల్ నియోజకవర్గం, మరిపెడ మండలంలో బుధవారం అక్రమంగా సొసైటీ గోదాములోకి ప్రవేశించి కొందరు యూరియా బస్తాలు అపహరించినట్లు మండల వ్యవసాయ అధికారి పిర్యాదు మేరకు , కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సతీష్ తెలిపారు.
సొసైటీ కార్యాలయంలో యూరియా బస్తాలను పంపిణీ చేస్తున్న క్రమంలో, బుధవారం సొసైటీ కార్యాలయంలోకి సోమ్లా తండాకు చెందిన అజ్మీరా వనిత, రేఖ్యా తండాకు చెందిన బాణోతు రవి, పగిడిల నరేష్, భూక్యా హర్బజన్ సింగ్, గూగులోతు సుమన్, బాధవతు నాన్పు అక్రమంగా చొరబడి 86 బస్తాల యూరియాను ఎత్తుకెళ్లారని, మొత్తం 6 గురిని, గుర్తించినట్లు ,మరికొందరిని గుర్తించ వలసి ఉన్నదని ఎస్ఐ తెలిపారు. యూరియా దొంగిలించిన వారందరిని శిక్షిస్తామని తెలిపారు.


