అక్రమంగా మట్టి తరలిస్తున్న వారిపై కేసు నమోదు
ఆరు ట్రాక్టర్లు, జేసీబీ సీజ్ చేసిన సీఐ విశ్వేశ్వర్
కాకతీయ, గీసుగొండ: ప్రభుత్వ భూమి నుండి అక్రమంగా మట్టి తరలిస్తున్న వారిపై గీసుగొండ పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ విశ్వేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని చంద్రయ్యపల్లి గ్రామ శివారులో ఎలాంటి అనుమతులు లేకుండా జేసీబీ సహాయంతో మట్టి తవ్వి ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్న సమయంలో పోలీసులు దాడి నిర్వహించారు. ఈ సందర్భంగా ఒక జేసీబీతో పాటు ఆరు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి గండికోట సతీష్ (27), గాడుదుల రాజకుమార్ (32), గాడుదుల శ్రావణ్ కుమార్ (30), కుప్పాల శ్రీనివాస్ (47), కుప్పాల అజయ్ (26), తోట పరుషరములు (37), గాడుదుల బాలారాజు (37)లపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అనుమతులు లేకుండా అక్రమంగా మట్టి తవ్వకం, తరలింపు చేపడితే కఠిన చర్యలు తప్పవని సీఐ విశ్వేశ్వర్ హెచ్చరించారు.


