కాకతీయ, ఖిలా వరంగల్: ఖిలా వరంగల్ లోని మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ కు కూత వేటు దూరంలో ప్రైవేట్ ఆర్ఎంపి అనుమతి లేకుండా హాస్పిటల్ నడుపుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని సదరు నకిలీ వైద్యుడు, కావ్య ఫస్ట్ఎయిడ్ సెంటర్ నిర్వాహకుడు ఎ. రమేష్ పైన ఎన్ఎంసి, టిఎస్ఎం పిఆర్ చట్టం ప్రకారం తెలంగాణ మెడికల్ కౌన్సిల్ రిజిస్టర్ డా డి. లాలయ్య కుమార్, చైర్మన్ డా కె. మహేష్ కుమార్ ల ఫిర్యాదు మేరకు ఎజె మిల్స్ కాలనీ పోలీసులు (ఎఫ్ఐఆర్ నెంబర్ :530/2025)కేసు నమోదు చేశారు.
కావ్య ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ని గత కొన్ని సంవత్సరాలు గా నిర్వహిస్తూ ప్రెస్క్రిప్షన్స్ రాస్తూ హై డోస్ ఆంటిబయోటిక్, స్టేరాయిడ్ లు ఇస్తునట్టు వచ్చిన ఫిర్యాదు మేరకు కౌన్సిల్ సభ్యుడు డా ఎం.శేషు మాధవ్,,ఐఎంఎ రాష్ట్ర ఆంటీక్వాకరీ కమిటీ అధ్యక్షులు డా కె.అశోక్ రెడ్డి , హెచ్ఆర్ డి ఎ వరంగల్ జిల్లా అధ్యక్షులు డా కె. వెంకట స్వామి ల బృందం గతంలో తనిఖీలు నిర్వహించి, శాస్త్రియ పరమైన ఆధారాలతో హైదరాబాద్ లోని కౌన్సిల్ కి నివేదిక ఇచ్చారు. గత సంవత్సరం వరంగల్ డిఎంహెచ్ఓ గా ఉన్న డా . వెంకటరమణ అనదికారికంగా నిర్వహిస్తున్న కావ్య ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ని నెల రోజులు సీజ్ చేయగా క్లినికల్ ఎస్టాబ్లిష్ మెంట్ చట్ట ప్రకారం ఫైన్ వేసి మళ్ళీ ఓపెన్ చేసి ఈసారి అవే చట్ట వ్యతిరేక పనులను తన పేరు లేకుండా ప్రెస్క్రిప్షన్ రాయడం, తెల్ల పేపర్ పైన ల్యాబ్ రిపోర్ట్ ఇస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
పలు మార్లు ఇలా చేసే నకిలీ వైద్యుల పైన కలెక్టర్ కి ఫిర్యాదు చేసి శాశ్వతంగా సీజ్ చెయడం తొ పాటు పిడి యాక్ట్ ప్రకారం కూడా కేసులు నమోదు చేస్తామని సభ్యులు డా ఎం. శేషు మాధవ్ తెలియ చేశారు. ఆర్ఎంపి లు అసలు వైద్యులు కారని, అర్హత లేకుండా వైద్యం చేసే నకిలీ వైద్యు లపై ఎన్ఎంసి, టిఎస్ఎంపి ఆర్ చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తామని వీరికి సంవత్సరం జైలు శిక్ష తొ పాటు 3 లక్ష ల వరకు జరిమానా విధిస్తారని అధికారులు తెలియచేశారు.


