epaper
Thursday, March 26, 2026
epaper

పంజాబ్‌లో మాజీ మంత్రిపై కేసు

పంజాబ్‌లోమాజీ మంత్రిపై కేసు
గగన్‌దీప్ సింగ్ రంధావా ఆత్మహత్య కేసులో మ‌లుపు
వేధింపుల ఆరోపణలపై లల్జిత్ సింగ్ భుల్లర్‌పై కేసు నమోదు

అమృత్‌సర్: పంజాబ్‌లో సంచలనం రేపిన ప్రభుత్వ అధికారి ఆత్మహత్య కేసు రాజకీయ మలుపు తీసుకుంది. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ జిల్లా మేనేజర్ గగన్‌దీప్ సింగ్ రంధావా ఆత్మహత్యకు సంబంధించి మాజీ మంత్రి లల్జిత్ సింగ్ భుల్లర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై మృతుడి భార్య ఉపిందర్ కౌర్ ఫిర్యాదు మేరకు అదే రోజు రంజిత్ అవెన్యూ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసులో భుల్లర్‌తో పాటు ఆయన తండ్రి సుఖ్‌దేవ్ సింగ్ భుల్లర్, వ్యక్తిగత సహాయకుడు దిల్బాగ్ సింగ్ పేర్లు కూడా చేర్చారు. భారతీయ న్యాయ సంహిత కింద ఆత్మహత్య ప్రేరేపణ, బెదిరింపులు, సామూహిక ఉద్దేశం వంటి సెక్షన్లతో కేసు నమోదు చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి భగవంత్ మాన్ భుల్లర్‌ను పదవి నుంచి తప్పుకోవాలని ఆదేశించారు. విచారణ నిష్పక్షపాతంగా సాగేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీంతో భుల్లర్ తన మంత్రివర్గ పదవికి రాజీనామా చేశారు. ఆయన వద్ద ఉన్న రవాణా, జైళ్ల శాఖ బాధ్యతలు కూడా ముగిశాయి. ఈ ఘటన రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వంపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి.

వేధింపుల ఆరోపణలు

మృతుడి భార్య చేసిన ఆరోపణలు కేసును మరింత క్లిష్టంగా మార్చాయి. పలుమాసాలుగా భర్తపై ఒత్తిడి, బెదిరింపులు కొనసాగుతున్నాయని ఆమె పేర్కొన్నారు. గిడ్డంగుల టెండర్ల కేటాయింపులో తమకు అనుకూలంగా వ్యవహరించాలని నిందితులు ఒత్తిడి తెచ్చారని తెలిపారు. భర్త నిరాకరించడంతో శారీరక దాడులు, మానసిక వేధింపులు పెరిగాయని ఆరోపించారు. పిస్టల్‌తో కూడా బెదిరించారని పేర్కొన్నారు. కుటుంబానికి హాని చేస్తామని బెదిరింపులు చేసినట్లు తెలిపారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలో రంధావా తనపై ఒత్తిడి, భయంతో సెల్ఫోస్ తీసుకున్నట్లు చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఆరోపణలను భుల్లర్ ఖండిస్తూ అవి అసత్యమని పేర్కొన్నారు. ఇదే సమయంలో ప్రతిపక్షాలు ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. టెండర్ కేటాయింపుల విషయంలో ఒత్తిడి తెచ్చినట్లు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం నిష్పక్షపాత విచారణకు ఆదేశించింది. విచారణలో వెలుగుచూసే అంశాలపై తదుపరి చర్యలు ఆధారపడి ఉండనున్నాయి.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

మోదీ ఖాతాలో మ‌రో రికార్డు

మోదీ ఖాతాలో మ‌రో రికార్డు భారత రాజకీయాల్లో నూతన మైలురాయి! ప్రభుత్వ అధినేతగా అత్య‌ధిక...

గ్రీన్ లాండ్‌ను మేం ర‌క్షిస్తాం

గ్రీన్ లాండ్‌ను మేం ర‌క్షిస్తాం ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ కౌంటర్ కాక‌తీయ‌, నేష‌న‌ల్ డెస్క్...

ఎల్పీజీ సంక్షోభానికి ఊరట

ఎల్పీజీ సంక్షోభానికి ఊరట మంగళూరు పోర్టుకు చేరిన‌ గ్యాస్ ట్యాంకర్లు వచ్చే వారం భారీ...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ప్రియుడితో పోలీస్ స్టేషన్‌కు మోనాలిసా..!

ప్రియుడితో పోలీస్ స్టేషన్‌కు మోనాలిసా..! స్టేష‌న్‌కు చేరుకున్న కుంభ‌మేళా బ్యూటీ ల‌వ్ మ్యాట‌ర్‌ తండ్రి...

108మంది మావోయిస్టుల లొంగుబాటు

108మంది మావోయిస్టుల లొంగుబాటు స‌రెండ‌ర‌యిన వారిలో 44 మంది మహిళా మావోయిస్టులు 101 అత్యాధునిక...

సివిల్స్‌లో మెరిసిన యువత..!

సివిల్స్‌లో మెరిసిన యువత..! యూపీఎస్సీ సివిల్స్ తుది ఫలితాల విడుదల దేశవ్యాప్తంగా తొమ్మిది వందల...

అమెరికా చేతులెత్తేస్తోందా..!

అమెరికా చేతులెత్తేస్తోందా..! ప్లాస్టిక్ డ్రోన్ల‌తో బురిడి కొట్టిస్తున్నా ఇరాన్‌ అంత‌కంత‌కు అమెరికాకు పెరుగుతున్న యుద్ధ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img