epaper
Sunday, March 1, 2026
epaper

సిరిసిల్ల పీఠంపై మళ్లీ కారు పట్టు

సిరిసిల్ల పీఠంపై మళ్లీ కారు పట్టు…
చైర్మన్‌గా జిందం కళా చక్రపాణి, వైస్ చైర్మన్‌గా దార్ల సందీప్
సిరిసిల్ల మున్సిపల్ చైర్మన్‌గా వరుసగా రెండోసారి కళా చక్రపాణి ఎన్నిక
వైస్ చైర్మన్ ఎంపికపై బుర్ర నారాయణ గౌడ్ అసంతృప్తి

కాకతీయ, రాజన్న సిరిసిల్ల : సిరిసిల్ల మున్సిపల్ పీఠంపై కొనసాగిన ఉత్కంఠకు తెరపడింది. చైర్మన్‌గా జిందం కళా చక్రపాణి ఎన్నికయ్యారు. సోమవారం జరిగిన ప్రత్యేక సమావేశంలో ఎన్నికల ప్రక్రియ పూర్తికాగా, కొత్త మున్సిపల్ కౌన్సిల్ బాధ్యతలు అధికారికంగా చేపట్టింది. ఈ విజయంతో బీఆర్ఎస్ మూడోసారి సిరిసిల్ల మున్సిపాలిటీలో అధికారాన్ని కొనసాగించింది. మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపికపై గత కొన్ని రోజులుగా పార్టీ అంతర్గతంగా చర్చలు కొనసాగాయి. ఈ క్రమంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ క్యాంప్‌లో ఉన్న 27 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లతో సుదీర్ఘంగా సమావేశమై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. అనంతరం పార్టీ సమన్వయంతో జిందం కళా చక్రపాణిని చైర్మన్‌గా ఖరారు చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

వరుసగా రెండోసారి చైర్మన్‌గా కళా చక్రపాణి
క్యాంప్ నుంచి నేరుగా మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్న కౌన్సిలర్లు ముందుగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం జరిగిన ఎన్నికలో జిందం కళా చక్రపాణి వరుసగా రెండోసారి మున్సిపల్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. దీంతో బీఆర్ఎస్ మున్సిపల్ పాలనను కొనసాగిస్తూ మరోసారి పట్టణంపై తన పట్టు నిలబెట్టుకుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ, సిరిసిల్ల మున్సిపాలిటీలో బీఆర్ఎస్ స్పష్టమైన మెజారిటీతో అధికారాన్ని నిలబెట్టుకుంది. మున్సిపల్ కౌన్సిల్‌లో కాంగ్రెస్‌కు ఆరుగురు, బీజేపీకి ఐదుగురు కౌన్సిలర్లు ఉండగా, ఒకరు స్వతంత్ర అభ్యర్థి ఉన్నారు. ఈ రాజకీయ సమీకరణాల నేపథ్యంలో పట్టణ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వ నిధుల సాధన కీలకంగా మారింది.

వైస్ చైర్మన్ ఎంపికపై వివాదం
వైస్ చైర్మన్ ఎంపికపై పార్టీ అంతర్గతంగా వివాదం తలెత్తింది. క్యాంప్‌లో వైస్ చైర్మన్‌గా బుర్ర నారాయణ గౌడ్ పేరును నిర్ణయించినట్లు సమాచారం. అయితే చివరి నిమిషంలో దార్ల సందీప్‌ను ఎంపిక చేసిన‌ట్లుగా కూడా తెలుస్తోంది. దీనిపై బుర్ర నారాయణ గౌడ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒకే వర్గానికి ప్రాధాన్యత ఇస్తున్నారంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ పరిణామం బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత చర్చకు దారితీసింది. సిరిసిల్ల మున్సిపల్ రాజకీయాలు మరోసారి వేడెక్కగా, కొత్త కౌన్సిల్ పట్టణ అభివృద్ధిలో ఎంతవరకు సఫలీకృతమవుతుందన్నది రాబోయే రోజుల్లో స్పష్టమవనుంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వేములవాడ ఏఎస్పీకి ఆకస్మిక బదిలీ..!

వేములవాడ ఏఎస్పీకి ఆకస్మిక బదిలీ..! రెండు నెలల్లోనే రుత్విక్ సాయి ట్రాన్స్‌ఫర్ డీఎస్పీగా శ్రీనివాసులు...

సర్కారు భూముల కబ్జాలపై కఠిన చర్యలు

సర్కారు భూముల కబ్జాలపై కఠిన చర్యలు ఆక్రమణలు తొలగించి పేదలకు పంపిణీ ధర్మారంలో క్రీడా...

ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రజక సంఘాల ఆగ్రహం

ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రజక సంఘాల ఆగ్రహం కరీంనగర్‌లో వీర్లపల్లి శంకర్ దిష్టిబొమ్మ దహనం బాధిత...

లక్ష్మీనరసింహస్వామి కళ్యాణంలో కలెక్టర్ దంపతులు

లక్ష్మీనరసింహస్వామి కళ్యాణంలో కలెక్టర్ దంపతులు పట్టు వస్త్రాలు సమర్పణ కాక‌తీయ‌, జగిత్యాల : ధర్మపురి...

హుజూరాబాద్‌లో బీఆర్‌ఎస్ భూస్థాపితం ఖాయం

హుజూరాబాద్‌లో బీఆర్‌ఎస్ భూస్థాపితం ఖాయం కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి ప్రణవ్ కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు,...

బండి సంజయ్ ధర్మం తప్పుతున్నారు

బండి సంజయ్ ధర్మం తప్పుతున్నారు బీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ రెబల్స్ చేరిక,...

50వ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా

50వ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా కార్పొరేటర్ బోయినపల్లి ప్రవీణ్ రావు కాక‌తీయ‌, కరీంనగర్ :...

సైన్స్‌పై మ‌క్కువ పెంచుకోవాలి

సైన్స్‌పై మ‌క్కువ పెంచుకోవాలి ప్రశ్నించేత‌త్వం అల‌వ‌ర్చుకోవాలి రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కాకతీయ, రుద్రంగి:...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img