కల్వర్ట్‌ను ఢీకొట్టిన కారు
గజ్వెల్ తహసీల్దార్ శ్రవణ్‌కుమార్ గాయాలు
కాకతీయ కరీంనగర్ : కోహెడ మండలం శంకర్‌నగర్ వద్ద మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కరీంనగర్ నుంచి గజ్వెల్‌కు వెళ్తున్న క్రమంలో తహసీల్దార్ శ్రవణ్‌కుమార్ ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి కల్వర్ట్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయనకు గాయాలయ్యాయని సమాచారం. వెంటనే అప్రమత్తమైన 108 సిబ్బంది గాయపడిన తహసీల్దార్‌ను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కారు ముందుభాగం తీవ్రంగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.


