- జల్సాలతోకు అలవాటుతో విద్యార్థులు తప్పుదోవా…!
- ఇద్దరు విక్రేతల అరెస్ట్
కాకతీయ, నర్సంపేట: గంజాయి అక్రమ రవాణా చేసి విక్రయిస్తున్న ఇద్దరు నిందితులు నర్సంపేట పోలీసులు సోమవారం పట్టుకొని కేసు నమోదు చేయినట్లు టౌన్ సిఐ రఘపతి రెడ్డి తెలిపారు.
సిఐ తెలిపిన వివరాల ప్రకారం భుపాలపల్లి జిల్లా, టేకుమట్ల కు చెందిన మారేపల్లి ప్రశాంత్ బిట్స్ కళాశాలలో చదువుకుంటూ తన తల్లిదండ్రులు ఇచ్చే డబ్బులు జల్సాలకు సరిపోక సులువైన మార్గంలో తక్కువ పెట్టుబడితో ఎక్కువ డబ్బులు సంపాదించాలని, ఎలాగైనా గంజాయి కొని దానిని విద్యార్థులకు అమ్మాలని నిశ్చాయించుకొని తన స్నేహితుడు వంచనగిరి విశ్వాస్ తో కలసి చాలాచోట్ల తిరిగిన గంజాయి దొరక్కపోవడంతో మహారాష్ట్రలోని చంద్రాపూర్ నుండి నర్సంపేటకు తీసుకువచ్చి ద్వారకాపేట రోడ్డు లోని వ్యవసాయ మార్కెట్ వద్ద గంజాయి అమ్ముతున్నారన్న సమాచారం రావడంతో వెంటనే సిబ్బంది తో కలసి నిందుతులను పట్టుకొని 128 గ్రాముల ఎండు గంజాయి విలువ సుమారు 6500/- మరియు ఒక మొబైలు ఫోన్ స్వాధీన పరుచుకొని ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.


