కాకతీయ, నెల్లికుదురు: మండలంలోని మునిగలవీడు గ్రామంలో రిషి కిరాణం నుండి కట్టుకలువ వరకు ఉన్న స్తంభాలకు వీధిలైట్లు లేకపోవడంతో స్టేజి కాడ దిగి ఊర్లోకి వచ్చే గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు. వర్షాకాలం కావడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, వెంటనే వీధిలైట్ ఏర్పాటు చేయాలని నిరసనగా సిపిఎం మండల కార్యదర్శి ఇసంపల్లి సైదులు ఆధ్వర్యంలో గ్రామస్తులతో కలిసి కొవ్వొత్తులు వెలిగించి నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెంటనే అధికారులు స్పందించి వీధిలైట్లు వేయాలని అన్నారు. కార్యక్రమంలో బత్తిని సత్యనారాయణ, కొమ్మనబోయిన ముఖేష్, ఊడుగుల అశోక్, కమటం రవి, కొండ ఐలయ్య, కాసర్ల వెంకన్న, జంపాల ముఖేష్, కమటం వినయ్, మార్కాపురం నర్సయ్య, కొమ్మనబోయిన శివ తదితరులు పాల్గొన్నారు.


