అభ్యర్థులు కోడ్ను పాటించాలి
గీసుగొండ సీఐ విశ్వేశ్వర్
పోలింగ్ కేంద్రాలను సందర్శించిన ఏసీపీ వెంకటేష్
కాకతీయ, గీసుగొండ : రాబోయే సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల ఆచార నియమావళిని తప్పనిసరిగా పాటించాలని గీసుగొండ సీఐ డి.విశ్వేశ్వర్ సూచించారు. ఎన్నికలు శాంతి యుతంగా,నిష్పాక్షికంగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.ఎన్నికల సమయంలో రెచ్చగొట్టే ప్రసంగాలు,కులమత ఆధారిత ప్రచారం, ఓటర్లను డబ్బు లేదా మద్యం ద్వారా ప్రభావితం చేయడం, నిరాధార ఆరోపణలు చేయడం, ప్రత్యర్థి అభ్యర్థుల ప్రచారాన్ని అడ్డుకోవడం వంటి చర్యలకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రచార ఊరేగింపులు, సభలు నిర్వహించే ముందు పోలీసులకు సమాచారం ఇవ్వాలని, నిబంధనలు ఉల్లంఘించిన పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. శాంతి భద్రతల కోసం ప్రజలు, అభ్యర్థులు, కార్యకర్తలు పోలీసులకు సహకరించాలని, ఏవైనా అనుమా నాస్పద కదలికలు గమనించిన వెంటనే సమాచారమి వ్వాలని సూచించారు. అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గీసుగొండ మండలంలోని వంచనగిరి, శ్యాంపేట,ఊకల్ హవేలీ, మరియాపురం,కోనాయిమాకుల,గీసుగొండ, రాంపూర్, మనుగొండ గ్రామాల్లోని పోలింగ్ స్టేషన్లను మామునూరు ఏసీపీ వెంకటేష్,సిఐ విశ్వేశ్వర్,ఎస్ఐ కుమార్, సంబంధిత గ్రామాల వీపీఓలతో కలిసి పరిశీలించారు.పోలింగ్ కేంద్రాల్లో తీసుకున్న ఏర్పాట్లు, భద్రతా చర్యలను సమీక్షిస్తూ, పోలింగ్ రోజున ఎలాంటి అంతరాయాలు లేకుండా ప్రజలు స్వేచ్ఛగా ఓటుహక్కు వినియోగించుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.


