వివాదాస్పదంగా కాలువ నిర్మాణం
కాకతీయ, రామకృష్ణాపూర్ : స్థానిక సూపర్ బజార్ 14 వ వార్డు పరిధిలోని గురుకుల పాఠశాల ముందు నూతనంగా చేపట్టే కాలువ నిర్మాణం వివాదాస్పదంగా మారింది. అదే వార్డుకు చెందిన కాలనీ ప్రజలు నూతన కాలువ పనులను కాకుండా పాత డ్రైనేజీ కాలువనే మరమ్మత్తులు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా మాజీ వార్డు కౌన్సిలర్ భర్త సంబంధిత సమస్యను మున్సిపల్ కమిషనర్ గద్దె రాజు దృష్టికి తీసుకెళ్లారు. ఇదే విషయంపై మున్సిపల్ కమిషనర్ గద్దె రాజును “కాకతీయ” వివరణ కోరగా కాలువ నిర్మాణం విషయంలో ప్రజల నుంచి అనేక అభ్యంతరాలు వచ్చినట్లు చెప్పారు. త్వరలోనే అర్ అండ్ బి అధికారులు వచ్చి సర్వే చేయనున్నట్లు చెప్పారు.


