epaper
Saturday, November 15, 2025
epaper

పురుగుల మందు తాగితే గాని పత్తి కొనరా??

పురుగుల మందు తాగితే గాని పత్తి కొనరా??
ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాలో సీసీఐ కేంద్రాల్లో కొనుగోళ్లు నామ‌మాత్ర‌మే
తేమ పేరుతో సీసీఐ నిర్లక్ష్యం
కొనుగోలులో నిబంధనలు పేరిట కొర్రీలు
దళారులదే పెత్తనమంటూ ఆరోప‌ణ‌లు
కలెక్టర్ గారు కనికరించండి రైతుల ఆవేదన

కాకతీయ, లక్షెటిపేట : ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాలో ప‌త్తి రైతుల ప‌రిస్థితి ద‌య‌నీయంగా మారింది. లక్షెటిపేట ప‌త్తి మార్కెట్లో ఏర్పాటు చేసిన సీసీఐ కేంద్రంలో కొనుగోలు ముందుకు సాగ‌డం లేద‌ని, సీసీఐ అధికారుల‌కు కొనుళ్ల‌కు కొర్రీలు పెడుతున్నారంటూ రైతులు వాపోతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పత్తి అమ్ముకునే అవకాశం లేకపోవడంతో అన్నదాతలు ఆవేదనకు గురవుతున్నారు. తాము చస్తే గాని పత్తిని కొనుగోలు చేయరా? ఇక్కడే ఆత్మహత్య చేసుకోవాలా? అని తమ దయనీయ పరిస్థితిని పట్టించుకునే వారే లేరంటూ మండిపడుతున్నారు. వాతావరణ ఆకస్మిక మార్పుల వలన తేమ ఏర్పడితే దానికి అన్నదాతను బలి చేయడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం పత్తికి ప్రకటించిన మద్ధతు ధర కాకపోయినా కనీస రేటు ఎందుకు ఇవ్వడం లేదని ఆక్రోశం వెళ్ళగక్కుతున్నారు. ఇటీవల వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు వర్షానికి తడిసిన పత్తిని కూడా కొనుగోలు చేయాలని, తేమ శాతాన్ని బట్టి రైతులకు సరైన న్యాయం చేయాలని ఆదేశాలు జారీ చేసిన విషయం విదితమే. కానీ సీసీఐ అధికారులు రైతులను అధిక తేమ పేరుతో వేధిస్తున్నారని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు.

బారులు తీరిన వాహనాలు..

గత కొన్నిరోజులుగా రైతులు మిల్లుకు తీసుకువచ్చిన పత్తిని అధిక తేమ పేరుతో తూకం వేయకపోవడంతో రోడ్డు పొడవునా పత్తి లోడ్ వాహనాలు బారులు తీరాయి. తక్కువ విస్తీర్ణంలో సాగు చేసిన రైతులకు వ్యాన్ కిరాయి, వేచి ఉండే సమయం, కూలీని భరించడం తడిసిమోపెడు అవుతోంది. ఒకవైపు కొనుగోలు చేయకు మరో వైపు తమ నెంబర్ ఎప్పుడూ వస్తుందో తెలియక రైతన్నలు ఆకలి దప్పులతో మిల్లు వద్దనే పడిగాపులు కాస్తున్నారు.ఇదిలా ఉండగా తమ కంటే వెనుక వచ్చిన నెంబర్ లకు అధికారులు కాంటా చేస్తున్నారని, దళారుల ప్రమేయంతో ఇలా జరుగుతుందని ఆరోపిస్తున్నారు.

మద్ధతు ధర పై పట్టింపేది??

ప్రభుత్వ ఆదేశాల ప్రకారం, తేమ శాతం 8 నుంచి 12 వరకు ఉంటే రూ. 8110 చొప్పున క్వింటాల్ కు చెల్లించాలి. ఒకవేళ తేమ శాతం 14 నుంచి 16 మధ్యలో ఉంటే అసలు సీసీఐ అధికారులు తమను పట్టించుకోవడం లేదని, ఒక వైపు వ్యవసాయ శాఖ మంత్రి, జిల్లా కలెక్టర్ లు 12 కంటే తేమ శాతం ఎక్కువ ఉంటే కూడా కొనుగోలు చేయాలని చెప్పారని రైతులు అంటున్నారు.మంత్రి, కలెక్టర్ మాటలు ఆచరణలో ఎక్కడ కనిపించడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. కొందరు దళారుల వలన 13 నుంచి 16 శాతం తేమ ఉందని, పత్తిని కొనుగోలు చేయమని చెప్పడంతో రైతులు బయట ప్రైవేట్ వ్యక్తులకు రూ. 6000 నుంచి రూ. 6500 వరకు తప్పనిసరి పరిస్థితిలో అమ్ముకుంటూ తీవ్రంగా నష్టపోతున్నారు. రైతులకు అండగా నిలువాల్సిన సీసీఐ అధికారులు తమను పట్టించుకోవడం లేదని, పైగా ప్రైవేట్ వ్యక్తుల పత్తి కొనుగోలుకు సహకరిస్తున్నారని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా కొందరు రాజకీయ నాయకులు, పలుకుబడి కలిగిన వ్యక్తులు తెచ్చిన పత్తిని వెంటనే తూకం వేసి, సీసీఐ అధికారులు మిగతా రైతులను పడిగాపులు కాసేలా చేస్తున్నారని కొందరు రైతులు బాహాటంగా విమర్శిస్తున్నారు. తమకు చదువు రాకపోవడంతో తేమకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేయకుండానే సంతకం చేయాలని అధికారులు ఒత్తిడి తెస్తున్నట్లు మీడియాకు తెలిపారు. ఈ విషయమై మార్కెట్ కమిటీ కార్యదర్శి రాజేశ్వర్ ను వివరణ కోరగా, కేవలం కొనుగోలు కేంద్రం ఓపెనింగ్ రోజు మాత్రమే తేమ శాతం 12 కంటే ఎక్కువ ఉంటే కూడా కొనుగోలు చేయాలని కలెక్టర్ ఆదేశించినట్లు తెలిపారు.ఇప్పుడు అలా కొనుగోలు చేయలేమని వెల్లడించారు. రైతులు ఆరోపణల్లో నిజం లేదని కొట్టిపారేశారు.

దళారుల రాజ్యం నడుస్తుంది.
రైతు కందుల రామయ్య, గ్రామం: లక్ష్మిపూర్

ఆరు క్వింటాళ్ల పత్తికి అరగోస పెడుతున్నారు. లక్ష్మిపూర్ గ్రామానికి చెందిన రైతు కందుల రామయ్య ఆరుగాలం కష్టపడి పండించిన పత్తి పంటను తేమ శాతం ఎక్కువ ఉందని, కటింగ్ ల పేరుతో రైతులను నిండా ముంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తేమ శాతం ఎక్కువగా ఉంది కావున రిటర్న్ పంపిస్తాము సంతకం పెట్టుమని బెదిరించారని అన్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి రైతుకు నష్టం జరగకుండా కొనుగోలు చేయాలని కోరారు.

పూర్తిగా ఆరిన పత్తిని కూడా కొనడం లేదు.
తప్పని సత్తయ్య
గ్రామం : లక్ష్మిపూర్

పత్తిని పూర్తిగా ఆరబెట్టుకొని తెచ్చిన కూడా తేమశాతం ఎక్కువగా వచ్చింది అంటూ మా పత్తిని కొనడం లేదు. ఎండిన పత్తిని కూడా తేమ పేరుతో వెనుకకు పంపిస్తున్నారని అన్నారు. కానీ దళారులు తెచ్చిన పత్తిని మాత్రం కొనుగోలు చేస్తూ, రైతులు తెచ్చిన పత్తిని తేమ పేరుతో వెనుకకు పంపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తేమ శాతాన్ని పరిశీలించి ఒకసారి 14, మరోసారి 15 అని చెప్పి మీ పత్తిని కొనుగోలు చేయమని రిటర్న్ పంపించడం జరుగుతుందని సంతకం పెట్టమని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే సంబంధిత అధికారులు చొరవ తీర్చుకొని రైతులకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

విప్లవ వీరుడి ఆశయాలను కొనసాగిద్దాం

విప్లవ వీరుడి ఆశయాలను కొనసాగిద్దాం ఆదివాసీ బిర్ధ్ గోండ్ తోటి సంఘం రాష్ట్ర...

ఆదిలాబాద్‌లో విద్యార్థులకు ఓపెన్ హౌస్

ఆదిలాబాద్‌లో విద్యార్థులకు ఓపెన్ హౌస్ కాకతీయ ఆదిలాబాద్ : పోలీసు అమరవీరుల సంస్మరణ...

వృద్ధులే కుటుంబాల‌కు మూల స్తంభాలు

వృద్ధులే కుటుంబాల‌కు మూల స్తంభాలు పెద్ద‌ల అనుభ‌వాల‌తోనే మ‌న‌కు మ‌నుగ‌డ‌ ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్...

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల‌ను వేగిరం చేయాలి

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల‌ను వేగిరం చేయాలి అధికారుల‌కు ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా...

ఉరి వేసుకొని వ్యక్తి మృతి

ఉరి వేసుకొని వ్యక్తి మృతి కాకతీయ,లక్షెట్టిపేట : మండలంలోని ఎల్లారం గ్రామానికి చెందిన...

ఆధ్యాత్మిక, మానవత విలువలపై తరగతులు

  ఆధ్యాత్మిక, మానవత విలువలపై తరగతులు కాకతీయ, రామకృష్ణాపూర్: శ్రీ సత్య సాయి సేవ...

ఘనంగా చాకలి ఐల‌మ్మ‌ జయంతి

ఘనంగా చాకలి ఐల‌మ్మ‌ జయంతి కాకతీయ, రామకృష్ణాపూర్ : పట్టణ రజక సంఘం...

అధికారులు అప్రమత్తంగా ఉండాలి

అధికారులు అప్రమత్తంగా ఉండాలి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కాకతీయ, రామకృష్ణాపూర్ : జిల్లాలో...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img