epaper
Sunday, March 1, 2026
epaper

ప్రజాధనంతో ప్రచారం

ప్రజాధనంతో ప్రచారం
సీఎం రేవంత్‌పై ఈసీకి జాగృతి నేత‌ల‌ ఫిర్యాదు
ప్రభుత్వ వేదికపై కాంగ్రెస్‌కు ఓటేయమని ప్ర‌చారం
ఎన్నికల నియమావళి ఉల్లంఘన చేశారు
ఫిర్యాదులో పేర్కొన్న జాగృతి నేత‌లు

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వ ధనాన్ని ఖర్చు చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ తెలంగాణ జాగృతి నాయకులు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎల్. రూప్‌సింగ్ ఆధ్వర్యంలో గురువారం ఎన్నికల కమిషన్ అసిస్టెంట్ సెక్రటరీ లింగ్యా నాయక్‌కు ఫిర్యాదు లేఖను జాగృతి నేతలు అందజేశారు. సీఎం అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని వారు ఆరోపించారు. రూప్‌సింగ్ మాట్లాడుతూ… మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న సమయంలో సీఎం రేవంత్ రెడ్డి మిర్యాలగూడలో ప్రభుత్వపరంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటేయాలని ప్రజలను కోరడం పూర్తిగా ఎన్నికల నియమావళికి విరుద్ధమని అన్నారు. పార్టీ తరఫున ప్రచారం చేయాల్సిన సీఎం, ప్రభుత్వ వేదికను ఉపయోగించుకోవడం ప్రజలను మోసం చేయడమేనని విమర్శించారు. గతంలో జరిగిన సర్పంచ్ ఎన్నికల సమయంలోనూ సీఎం ఇదే విధంగా నిబంధనలు ఉల్లంఘించారని, అప్పుడు తమ సంస్థ అధ్యక్షురాలు కవిత స్వయంగా ఈసీని కలిసి ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని రూప్‌సింగ్ గుర్తుచేశారు. ఈసారి మాత్రం ఫిర్యాదుపై చర్యలు తీసుకుంటామని ఎన్నికల కమిషన్ హామీ ఇచ్చిందని తెలిపారు. సీఎస్‌కు లేఖ రాసి తగిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ చెప్పినట్లు వెల్లడించారు.

నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు

జాగృతి సీనియర్ నాయకుడు సయ్యద్ ఇస్మాయిల్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి ప్రజాధనాన్ని, అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఓటర్లను మభ్యపెడుతున్నారని తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సీఎం ఇదే ధోరణి కొనసాగిస్తున్నారని, అధికార యంత్రాంగం, ఎన్నికల సంఘం సరైన చర్యలు తీసుకోకపోవడంతో ఆయన యథేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు. టీఎన్ శేషన్ రూపొందించిన ఎన్నికల నియమావళిని అమలు చేయాల్సిన బాధ్యత ఈసీపై ఉందని, కానీ నిబంధనలను పక్కనపెట్టి వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ కనుసన్నుల్లో కాకుండా ఈసీ కనుసన్నుల్లో ఎన్నికలు జరగాలని, బాధ్యతాయుత పదవిలో ఉన్న సీఎం బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.

జాగృతి నాయకుడు నరేష్ ప్రజాపతి మాట్లాడుతూ, ప్రజాపాలన అని చెప్పే సీఎం ప్రజలను పూర్తిగా గాలికి వదిలేశారని, ప్రభుత్వ సొమ్ముతో ఎన్నికల ప్రచారం చేస్తూ వ్యవస్థను భ్రష్టుపట్టిస్తున్నారని ఆరోపించారు. గతంలో ఫిర్యాదు చేసినా ఈసీ పట్టించుకోలేదని, ఈసారి మాత్రం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిందన్నారు. ముఖ్యమంత్రి చేస్తున్న తప్పిదాలను ప్రజలకు వివరించి ఆయన తీరును ఎండగడతామని, ప్రజాధనం దుర్వినియోగంపై ప్రజలే తగిన తీర్పు ఇస్తారని హెచ్చరించారు.
ఈసీకి ఫిర్యాదు చేసిన వారిలో జాగృతి సీనియర్ నాయకులు కోల శ్రీనివాస్, నరేందర్ యాదవ్, మరిపెల్లి మాధవి తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..?

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..? ప‌నిచేస్తున్న‌ట్టా..? చేయ‌డం లేద‌న్న‌ట్టా..?! త్రిశంకు స్వ‌ర్గంలో భూ భార‌తి స‌ర్వేయ‌ర్లు వ‌ర్క ఆర్డ‌ర్...

భూ భారతి కాదు…భూ దోపిడీ!

భూ భారతి కాదు…భూ దోపిడీ! కాంగ్రెస్ నేతలు, అధికారుల జేబులు నింపడానికే కొత్త...

నియో పోలీస్‌కు నీటి భరోసా!

నియో పోలీస్‌కు నీటి భరోసా! జలమండలికి 3.95 ఎకరాల భూమి కేటాయింపు గ్రావిటీ విధానంలో...

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల ఆసరా

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల ఆసరా ఒక రోజు పెన్షన్‌తో...

పేదల ఇండ్లు కూల్చడం అమానుషం

పేదల ఇండ్లు కూల్చడం అమానుషం కాంగ్రెస్ పాలనలో క‌క్షపూరిత విధానాలు కొనసాగుతున్నాయి మాజీ మంత్రి...

జీపీలకు రూ.389 కోట్లు.. ఉద్యోగులకు రూ.745 కోట్లు విడుదల

జీపీలకు రూ.389 కోట్లు.. ఉద్యోగులకు రూ.745 కోట్లు విడుదల పెండింగ్ బిల్లుల చెల్లింపుకు...

విద్యా కమిషన్‌లో విద్యావేత్తలే లేరా?

విద్యా కమిషన్‌లో విద్యావేత్తలే లేరా? పీహెచ్‌డీలు లేకుండా విద్యా విధానం ఎలా? అర్హతలేని కమిటీతో...

“విద్యార్థుల నుంచి అధికారుల వరకూ… ఇది మీ త్యాగాల ఫలితం”

“విద్యార్థుల నుంచి అధికారుల వరకూ… ఇది మీ త్యాగాల ఫలితం” ప్రజలు ఆకలిని...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img