ప్రయాణికులకు మజ్జిగ పంపిణీ
గుడ్ ఫ్రైడేను పురస్కరించుకుని సేవా కార్యక్రమాలు
కాకతీయ, తొర్రూర్ (నెల్లికుదురు): అవసరంలో ఉన్న ప్రజలకు సేవ చేయడం మానవతా ధర్మమని పీఎంఏఎన్ ట్రస్ట్ ఫౌండర్ పోతరాజు మహేందర్ తెలిపారు. శుక్రవారం ఈ విషయాన్ని తెలిపారు. గుడ్ ఫ్రైడే సందర్భంగా తొర్రూర్ బస్టాండ్ ఆవరణంలో ప్రయాణికులకు మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పీఎంఏఎన్ ట్రస్ట్ ఫౌండర్ పోతరాజు మహేందర్ మాట్లాడుతూ వేసవి కాలంలో తాగునీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో మజ్జిగ పంపిణీ ద్వారా ఉపశమనం కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ప్రేమా ఆనంద నిలయము స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని చెప్పారు. అనాధలు, వృద్ధులు, దిక్కులేని వారు, కుష్ఠు రోగులు, హెచ్ఐవీ బాధితులకు భవిష్యత్తులో మరింత సహాయం అందించేందుకు తమ సంస్థ సిద్ధంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సునీత, సూర్య, ఫ్లెక్సీ డిజైనర్ పూసపల్లి రంజిత్ కుమార్, కేశపాక స్రవంతి తదితరులు పాల్గొన్నారు.


