డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో రచ్చ
పోలీసులతో వాగ్వాదం.. వాహనం స్వాధీనం
కాకతీయ, కరీంనగర్ : నగరంలోని తెలంగాణ చౌక్ వద్ద పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల సందర్భంగా ఓ వాహనదారుడు హల్‌చల్ చేశాడు. బ్రీత్ అనలైజర్ పరీక్షకు పోలీసులు సూచించగా, అందుకు నిరాకరిస్తూ పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. అధికారులు ఎంతగా నచ్చజెప్పినా వినకుండా దురుసుగా ప్రవర్తించడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చిన పోలీసులు అతని వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిబంధనల ఉల్లంఘన కింద వాహనదారుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


