భూపాలపల్లి మున్సిపల్ పీఠంపై బుర్ర కొమురయ్య గౌడ్
2వ వార్డు కౌన్సిలర్‌గా విజయం సాధించి చైర్మన్ పీఠం అధిరోహణ
కాకతీయ, భూపాలపల్లి : భూపాలపల్లి మున్సిపాలిటీ చైర్మన్‌గా 2వ వార్డు కౌన్సిలర్ బుర్ర కొమురయ్య గౌడ్ బాధ్యతలు స్వీకరించారు. బుర్ర కొమురయ్య గౌడ్ చైర్మన్‌గా ఎన్నిక కావడంతో గౌడ, బీసీ వర్గాల నాయకులు, కార్యకర్తలు, అనుచరులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బీసీ వర్గాలకు ఇది గౌరవప్రదమైన పరిణామమని పేర్కొంటూ పలువురు నాయకులు అభినందనలు తెలిపారు. ఆయన నాయకత్వంలో మున్సిపాలిటీ మరింత అభివృద్ధి చెందుతుందనే నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా బుర్ర కొమురయ్య గౌడ్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి చైర్మన్‌గా అవకాశం కల్పించిన పార్టీ నాయకత్వానికి, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. భూపాలపల్లి మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధి కోసం కృషి చేస్తానని, ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తానని స్పష్టం చేశారు. ప్రజల ఆశలకు అనుగుణంగా పారదర్శకంగా పనిచేస్తూ మున్సిపాలిటీని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తానని ఆయన పేర్కొన్నారు. ప్రజా సేవే తన ధ్యేయమని, అందరి సహకారంతో భూపాలపల్లి మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని తెలిపారు.


