సీఎం దిష్టిబొమ్మ దహనం
కాకతీయ, నర్సింహులపేట : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో దేశ సైన్యం,కేంద్ర ప్రభుత్వం, బీజేపీపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ ఆయన దిష్టిబొమ్మను బీజేపీ నాయకులు ఆదివారం దహనం చేశారు. ఈసందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు సూరబోయిన సతీష్ మాట్లాడుతూ పార్టీపై చేసిన వ్యాఖ్యలను వెనుకకు తీసుకొని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో అధికార దుర్వినియోగం చేస్తూ, మాయ మాటలతో గెలిచేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి ఏరనాగి కుమారస్వామి, ఉపాధ్యక్షుడు సత్యనారాయణ రెడ్డి, యాకయ్య, సీనియర్ నాయకులు దాసరి వీరన్న, కాలునాయక్ తదితరులు పాల్గొన్నారు.


