రాష్ట్ర ప్రగతికి బడ్జెట్ దిక్సూచి
అన్ని వర్గాలకు సమన్యాయం చేసేలా కేటాయింపులు
బడ్జెట్‌పై హుజురాబాద్ కాంగ్రెస్ ఇంచార్జి ప్రణవ్ హర్షం
కాకతీయ, హుజూరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ రాష్ట్ర ప్రగతికి దిక్సూచిగా నిలుస్తుందని హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన కార్యాలయం నుంచి విడుదల చేసిన ప్రకటనలో వివరించారు.
పదేళ్ల విద్వంసం తర్వాత రాష్ట్రాన్ని వికాస పథంలోకి తీసుకెళ్లే విధంగా బడ్జెట్ రూపుదిద్దుకుందని తెలిపారు. ఉపాధి అవకాశాల పెంపు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఆరు గ్యారెంటీల అమలు వంటి అంశాలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు పేర్కొన్నారు.కుటుంబాలకు జీవిత బీమా అందించే నిర్ణయం పేద, మధ్య తరగతి ప్రజలకు ఎంతో ఉపయోగకరమని అన్నారు. ప్రజాపాలనలో ప్రతి ఒక్కరికి సుపరిపాలన అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, ఆ దిశగా ఈ బడ్జెట్ ఉందని హర్షం వ్యక్తం చేశారు.ఈ నెల 22న ఆదివారం నుంచి రైతు భరోసా నిధుల విడుదల ప్రారంభం కానుందని తెలిపారు.


