కాకతీయ, కరీంనగర్ : బీఎస్‌ఎన్‌ఎల్ కరీంనగర్ శాఖ సిల్వర్ జూబిలీ (2000–2025) వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. డిప్యూటీ జనరల్ మేనేజర్ పొన్నం అజయ్ కేక్ కటింగ్‌తో ప్రారంభమైన కార్యక్రమంలో బీఎస్‌ఎన్‌ఎల్ 25 సంవత్సరాల సేవలను, స్వదేశీ 4జీ నెట్‌వర్క్ ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాన్ని వివరించారు. ప్రధాన వీధులలో రోడ్ షో ద్వారా బీఎస్‌ఎన్‌ఎల్ సేవల గురించి ప్రజలకు అవగాహన కల్పించి, భారత్ ఫైబర్, మొబైల్ 4జీ సేవలను ప్రదర్శించారు. అనంతరం రక్తదాతల దినోత్సవం సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీతో రక్తదాన శిబిరం నిర్వహించారు. డీఈ, ఏస్‌డీఈ, ఏవో, జేటీవో, జేఏవో లు, ఇతర ఉద్యోగులు కార్యక్రమంలో పాల్గొని రక్తదాన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఘనంగా బీఎస్‌ఎన్‌ఎల్ సిల్వర్ జూబ్లీ వేడుకలు
అప్డేట్ న్యూస్ కోసం కాకతీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి


