జగిత్యాలలో దారుణ హత్య
కాకతీయ,జగిత్యాల : జగిత్యాల పట్టణ బైపాస్ రోడ్డులో ఆదివారం దారుణ ఘటన చోటుచేసుకుంది. రూరల్ మండలం పోరండ్ల గ్రామానికి చెందిన బోరే విశ్వనాథ్ (30)పై గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు కర్రలతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన విశ్వనాథ్ అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.
స్థానికులు సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కొద్ది నెలల క్రితం జరిగిన వ్యక్తిగత విభేదాలే ఈ హత్యకు కారణమై ఉండొచ్చని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.
ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


