epaper
Sunday, March 1, 2026
epaper

రైతుల పక్షాన బీఆర్ఎస్ పోరాటం ఆగదు: పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి

కాకతీయ పరకాల: రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచైనా రైతులకు యూరియా అందేలా చేస్తామని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. గురువారం పరకాల పట్టణంలోని ఎఫ్ జె గార్డెన్స్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. రెండు రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు సరిపడా యూరియా అందుబాటులోకి తేవాలని డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో రైతుల పక్షాన పోరాటం చేస్తామని హెచ్చరించారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం మాటలకే పరిమితమైంది తప్పా ఆచరణలో పనులు చేయడం లేదని అన్నారు. రైతులకు కావాల్సిన ఎరువులు అందుబాటులో ఉంచకుండా వారిని కష్టాలపాలు చేస్తున్నదన్నారు. వ్యవసాయం చేయాల్సిన అన్నదాతలు రాత్రి, పగలు తేడా లేకుండా సొసైటీల వద్ద యూరియా కోసం పడిగాపులు కాస్తున్నా ఈ ప్రభుత్వానికి స్థానిక ఎమ్మెల్యేకు చీమ కుట్టినట్లెనా లేదన్నారు.

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో రైతులకు సరిపడా ఎరువులు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. రైతులకు యూరియా అందుబాటులోకి వచ్చేదాక ప్రభుత్వంపై బీఆర్‌ఎస్‌ పార్టీ పోరాటం చేస్తుందన్నారు. యూరియా ఏదని అడిగిన అన్నదాతలపై అక్రమ కేసులు పెడుతున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి రైతులను కించపరిచేలా మాట్లాడుతున్నారని, యూరియా కొరత లేదని సమస్యను పక్కదోవ పట్టించడం ముఖ్యమంత్రి అసమర్థతకు నిదర్శనమన్నారు. యూరియా కోసం గోస పడుతున్న రైతుల ఉసురు ఈ ప్రభుత్వానికి తప్పకుండా తాకుతుందన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టించేలా గోబెల్స్‌ ప్రచారం చేస్తున్నదన్నారు. కాళేశ్వరం కూలిపోయిందని అబద్ధాలు చెబుతూనే అదే ప్రాజెక్ట్‌ నుంచి నీళ్లను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని అన్నారు. ఘోష్‌ కమిషన్‌తో కాంగ్రెస్‌ పార్టీ రిపోర్ట్‌ తయారు చేయించి, దాని ఆధారంగా కేసీఆర్‌పై సీబీఐ విచారణ చేయించడం దుర్మార్గపు చర్య అని అన్నారు.

స్థానిక ఎమ్మెల్యే బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంజూరై,శంకుస్థాపన చేసిన పనులకే మళ్ళీ శంకుస్థాపన చేసే పనిలో ఉన్నారు తప్ప కొత్తగా చేసిందేమి లేదన్నారు.అర్థరాత్రి రైతులు సొసైటీల దగ్గర ఇంత గోస పడుతుంటే ఎమ్మెల్యే ఎక్కడ పోయారని ప్రశ్నిస్తున్నానని అన్నారు.యూరియా అడిగినవారిపై కేసులు పెట్టడం కాదని వారి వద్దకు వచ్చి చేతనైతే యూరియా ఇప్పించాలని స్థానిక ఎమ్మెల్యేకు సూచించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు , యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కొమ్మాల జాతరకు ఉత్సవ కమిటీ ఉన్నట్టా… లేనట్టా..?

కొమ్మాల జాతరకు ఉత్సవ కమిటీ ఉన్నట్టా… లేనట్టా..? చైర్మన్ లేకుండానే కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు జాతర...

కొమ్మాల జాతరను విజయవంతం చేద్దాం..

కొమ్మాల జాతరను విజయవంతం చేద్దాం.. *ముదిరాజ్ మహాసభ మండల అధ్యక్షుడు కొత్తగట్టు రాజేందర్...

కమలాపూర్‌లో ఘెర రోడ్డు ప్ర‌మాదం

కమలాపూర్‌లో ఘెర రోడ్డు ప్ర‌మాదం డివైడర్‌ను ఢీకొట్టి బైక్‌.. ఇద్ద‌రు దుర్మ‌ర‌ణం శనిగరం గ్రామంలో...

చెన్నారావుపేటలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..!

చెన్నారావుపేటలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..! మేజర్ గ్రామ సర్పంచ్ సహా నేతల కాంగ్రెస్‌లో...

ప్రభబండ్ల నిర్వాహకులకు మార్గదర్శకాలు

ప్రభబండ్ల నిర్వాహకులకు మార్గదర్శకాలు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు డీసీపీ అంకిత్ హెచ్చరిక కాకతీయ,గీసుగొండ:...

ఎమ్మెల్యే ఆదేశాలు.. కాంట్రాక్టర్ బేఖతార్..!

ఎమ్మెల్యే ఆదేశాలు.. కాంట్రాక్టర్ బేఖతార్..! కొమ్మాల జాతరలో భద్రతపై నిర్లక్ష్యం? బావులకు కాంక్రీట్ గోడలు...

ప్ర‌భ‌ల బ‌లాబ‌లాలు..!

ప్ర‌భ‌ల బ‌లాబ‌లాలు..! కొమ్మాల జాతరకు సిద్ధమవుతున్న ప్రభల పందెం! ప్రదర్శనకు పార్టీల పోటాపోటీగా బండ్ల...

న్యూ కౌటిల్యాస్ సెయింట్ ఆమెన్ హైస్కూల్లో సైన్స్ డే

న్యూ కౌటిల్యాస్ సెయింట్ ఆమెన్ హైస్కూల్లో సైన్స్ డే కాకతీయ, వరంగల్ సిటీ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img