ఏటూరునాగారంలో బీఆర్ఎస్ విజయ ఉత్సాహం
డ్యాన్స్ చేసిన లక్ష్మణ్ బాబు.. బడే నాగజ్యోతి ( వీడియో)
ములుగులో నీ పతనం మొదలైంది అక్కో!
ములుగు జిల్లా ఏటూరు నాగారం సర్పంచ్ స్థానంలో
3,230 ఓట్ల భారీ మెజారిటీతో
బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాకులమర్రి శ్రీలత ఘన విజయం. pic.twitter.com/NkRj50JMcZ— 𝐆𝐮𝐦𝐩𝐮 𝐌𝐞𝐬𝐭𝐫𝐢 (@gumpumestri) December 12, 2025
కాకతీయ, వెబ్‌డెస్క్ : ములుగు జిల్లా ఏటూరు నాగారం సర్పంచ్ స్థానంలో 3,230 ఓట్ల భారీ మెజారిటీతో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాకులమర్రి శ్రీలత ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. శుక్రవారం ఉదయం ఏటూరునాగారం పార్టీ శ్రేణులు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా జరిగిన విజయోత్సవ సంబరాల్లో పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్‌బాబు, నియోజకవర్గ బీఆర్ ఎస్ పార్టీ ఇన్చార్జి బడే నాగజ్యోతి పాల్గొన్నారు. ఈసందర్భంగా ములుగు జిల్లాలో బీఆర్ ఎస్ పార్టీకి పూర్వ వైభవం వస్తుందని, కాంగ్రెస్ పార్టీకి.. ములుగులో నీ పతనం మొదలైంది అక్కో అంటూ పరోక్షంగా సీతక్కను ఉద్దేశించి శ్రేణులు గళమెత్తాయి. విజయోత్సవ ర్యాలీలో బడే నాగజ్యోతి, లక్ష్మణ్‌బాబు నృత్యాలు చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.


