48వ డివిజన్‌లో బిఆర్ఎస్ బలోపేతం
500 మందితో పార్టీలోకి చేరిన నాయకులు
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ నగరంలోని 48వ డివిజన్ విద్యానగర్ పరిధి కురుమవాడకు చెందిన డివిజన్ నాయకులు గుంటి మధుమిత, ప్రశాంత్ ఆదివారం బిఆర్ఎస్ పార్టీలో చేరారు. మాజీ కార్పొరేటర్ కచ్చు రవి ఆధ్వర్యంలో సుమారు 500 మంది అనుచరులు పార్టీ కండువా కప్పుకొని బిఆర్ఎస్‌లో చేరడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ చేరికల కార్యక్రమం గంగుల కమలాకర్ నివాసంలో జరిగింది.
నగర రాజకీయాల్లో బిఆర్ఎస్ స్థానం మరింత పటిష్టమవుతుందని, రానున్న మున్సిపల్ ఎన్నికల్లో పార్టీకి ఈ చేరికలు బలంగా నిలుస్తాయని పార్టీ నాయకులు అభిప్రాయపడ్డారు.


