మృతుడి కుటుంబానికి బియ్యం అందించిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు
మాజీ ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు పార్టీ నాయకులు గుగులోతు లక్ష్మణ్ నాయక్
కాకతీయ, ఖానాపురం : ఖానాపురం గ్రామానికి చెందిన తాపీ మేస్త్రి నాగిలి పుల్లయ్య గుండెపోటుతో మృతిచెందగా మృతుడి కుటుంబ సభ్యులను ఖానాపురం మాజీ ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు బిఆర్ఎస్ పార్టీ నాయకులు గుగులోతు లక్ష్మణ్ నాయక్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు పరామర్శించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు గుగులోతు లక్ష్మణ్ నాయక్ అందించిన 50 కేజీల బియ్యంతో పాటుగా ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో ఖానాపురం మాజీ ఉపసర్పంచ్ మేడిద కుమార్ మాజీ ఎంపీటీసీ బోడ పూలు నాయక్ పార్టీ నాయకులు గంగపురం రాజు గౌడ్, వడ్డే రాజశేఖర్, ముద్దంగుల రవీందర్, మడత బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.


