- పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి
కాకతీయ, పరకాల: నడికూడ బీఆర్ఎస్ మాజీ ఎంపీటీసీ, మాజీ సర్పంచ్ అప్పం చేరాలు, అప్పం లక్ష్మి, ఆ పార్టీ కి రాజీనామా చేసి సోమవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ మేరకు హనుమకొండ లోని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి నివాసం లో వారికీ కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి మాట్లాడుతూ కొత్త పాత తేడా లేకుండా పార్టీ కి సేవలు అందిస్తున్న ప్రతి ఒక్కరిని కాపాడుకుంటామని అన్నారు. స్థానిక ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ లకు తగిన బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో టీపీసీసీ మాజీ ఉపాధ్యక్షుడు దొమ్మటి సాంబయ్య, మండల సమన్వయ కమిటీ సభ్యులు మాజీ సర్పంచ్ పర్నెం తిరుపతి రెడ్డి, పాడి వివేక్ రెడ్డి, నడికూడ మండల ఎస్సి సెల్ ప్రధాన కార్యదర్శి దుప్పటి సదానందం, గ్రామ ప్రధాన కార్యదర్శి జీల శ్రీనివాస్, కుమారస్వామి, ధర్మారం గ్రామ కమిటీ అధ్యక్షుడు గడల రమేష్, తదితరులు పాల్గొన్నారు.


