- అన్ని సర్వేలు మాకే అనుకూలం
- మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
కాకతీయ, పెద్దవంగర : స్థానిక పోరులో బీఆర్ఎస్ సత్తా చాటాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. శనివారం మండల కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కన్నయగూడెం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ మేరకు వారిని పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ లోకల్ బాడీ ఎన్నికలో బిఆర్ఎస్ సత్తా చాటలని, కార్యకర్తలకు అండగా తానున్నాంటూ బాగా పనిచేయాలని సూచించారు. ప్రజల్లో పాలకుర్తిలో తాను, అక్కడ పరిపాలనలో కేసీఆర్ లేడనే బాధ స్పష్టంగా కనిపిస్తోందన్నారు.
కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల హామీతో అందర్నీ మోసం చేసిందన్నారు. గ్రామాలలో బిఆర్ఎస్ లేని లోటు కనిపిస్తుందని, కాంగ్రెస్ పార్టీ వస్తే ఎదో వస్తుందని లంబాడీ నాయకులు అనుకుంటే వారిని కూడా రేవంత్ రెడ్డి మోసం చేశారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి వచ్చి ఉన్న పథకాలనే సరిగా ఇవ్వలేకపోతున్నారని, ఆరు గ్యారెంటీలకే హరి గోస పడుతున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ మ్యానిఫెస్టులో లేని ఎన్నో పథకాలు ప్రవేశ పెట్టారని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ఈదురు ఐలయ్య, సీనియర్ నాయకుడు రామచంద్రయ్య శర్మ, పాలకుర్తి యాదిగిరి రావు, సుదీర్ బాబు, సంజయ్, చింతల భాస్కర్, హరీష్ తదితరులు పాల్గొన్నారు.


