కాకతీయ, పెద్దవంగర : మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండల నూతన ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన చిలువేరు ప్రమోద్ కుమార్ ను బీఆర్ఎస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఈదురు ఐలయ్య, ఉపాధ్యక్షుడు కనుకుంట్ల వెంకన్న, మాజీ సర్పంచ్ లు వేముల రఘు, గుగులోతు పటేల్ నాయక్, గ్రామ అధ్యక్షుడు ఆరుట్ల వెంకట్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ ఎర్ర వెంకన్న, అంగోత్ శంకర్, గ్రామ యూత్ అధ్యక్షుడు అనపురం రాజు తదితరులు పాల్గొన్నారు.


