ఉటూరు కాంగ్రెస్‌లోకి బీఆర్ఎస్ నేతలు
మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం ఉటూరు గ్రామానికి చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులు గురువారం ఎల్ఎండీ కాలనీలోని ప్రజాభవన్‌లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కవ్వంపల్లి మాట్లాడుతూ.కాంగ్రెస్‌లో చేరిన ప్రతి నాయకుడు పార్టీ బలోపేతానికి శక్తినిస్తాడని అభిప్రాయపడ్డారు. బీఆర్ఎస్ దశాబ్ద పాలన అవినీతి, అక్రమాలతో ప్రజలను విసిగించిందని, అందుకే ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు గుణపాఠం చెప్పారని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణతో రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తోందని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ₹500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, కొత్త రేషన్ కార్డుల పంపిణీ, సన్నబియ్యం సరఫరా వంటి హామీలను ప్రభుత్వం అమలు చేస్తోందని గుర్తుచేశారు. నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు వేగవంతం చేశామని వివరించారు.గ్రామాభివృద్ధిలో పంచాయతీ ఎన్నికలు కీలకమని, కాంగ్రెస్ మద్దతుదారులు సర్పంచులుగా గెలవాలంటే అందరూ కలిసికట్టుగా పనిచేయాలన్నారు. తాను ఎమ్మెల్యేగా పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.కాంగ్రెస్‌లో చేరినవారిలో ఎనగందుల మల్లయ్య, బక్కయ్య, శంకర్, రాజు, కల్వల అంజయ్య, బొల్లం సంధ్య, కె.అంజయ్య, జినుక అంజయ్య తదితరులు ఉన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షుడు బొంగోని సునిల్ గౌడ్, పార్టీ నాయకులు గోపు శ్రీనివాస్ రెడ్డి, రేమిడి శ్రీనివాస్ రెడ్డి, సర్పంచ్ అభ్యర్థి వెలిశెట్టి కళ్యాణి కిశోర్ తదితరులు పాల్గొన్నారు.


