కాంగ్రెస్‌లోకి బీఆర్ ఎస్ నేతలు
మహమ్మద్ గౌస్‌పల్లిలో కారు పార్టీకి ఝలక్
కాకతీయ, ములుగు ప్రతినిధి : ములుగు జిల్లా మల్లంపల్లి మండలం మహమ్మద్ గౌస్‌పల్లి గ్రామానికి చెందిన బిఆర్ఎస్ సీనియర్ నాయకులు చింతనిప్పుల లింగమూర్తి, పసరగొండ రవి, కనకం భానుచందర్ ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరిని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఆహ్వానిస్తూ సాదరంగా పార్టీలోకి చేర్చుకుంది.ఈ సందర్భంగా జిల్లా నాయకులు మేకల ప్రశాంత్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని తెలిపారు. మహమ్మద్ గౌస్‌పల్లి గ్రామానికి ఎక్కువ సంఖ్యలో ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు. అలాగే గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న గృహ నిర్మాణ సమస్యలు, సంక్షేమ కార్యక్రమాల అమలుకు ప్రభుత్వం తరఫున ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. బిఆర్ఎస్ నేతల కాంగ్రెస్ చేరికతో గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి మరింత బలం చేకూరుతుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు ఉప్పు మొగిలి, గ్రామ ఉపాధ్యక్షులు కనకం సదానందం, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


