కాకతీయ, పెద్దవంగర : గుండెపోటుతో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పాకనాటి సోమారెడ్డి మృతి చెందారు. సోమవారం మధ్యాహ్నం పాలకుర్తి దేవస్థాన ఆలయ ప్రాంగణంలో ఉండగా అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించినట్లు కుటుంబీకులు తెలిపారు. సోమారెడ్డి మృతి పట్ల పెద్దవంగర మండల బీఆర్ఎస్ నాయకులు తమ సంతాపాన్ని తెలియజేశారు.


