బీఆర్ఎస్ ఫస్ట్ లిస్ట్ రిలీజ్
12 మంది అభ్యర్థుల పేర్లు ప్రకటన
వివరాలు వెల్లడించిన పెద్ది సుదర్శన్‌రెడ్డి
నర్సంపేట మున్సిపాలిటీపై గులాబీ గురి
కాకతీయ, వరంగల్ ప్రతినిధి: నర్సంపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల తొలి జాబితాను బీఆర్ఎస్ ప్రకటించింది. 12 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఈమేరకు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి వివరాలు వెల్లడించారు. పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. రోడ్లు, నీటి సరఫరా, పారిశుధ్యం వంటి కీలక సమస్యలపై తక్షణ చర్యలు తీసుకుంటామన్నారు.
వార్డుల వారీగా అభ్యర్థుల పూర్తి జాబితా:
2వ వార్డు: గోలి అనిత-శ్రీనివాస్ రెడ్డి
7వ వార్డు: గాండ్లోజు భాస్కర్
9వ వార్డు: రాయిడి కీర్తి-దుష్యంత్ రెడ్డి
10వ వార్డు: నాగిశెట్టి పద్మ-ప్రసాద్
12వ వార్డు: ఇస్లావత్ రజిత-రాజన్న
13వ వార్డు: ఆంగోతు సుధాకర్ లాల్
14వ వార్డు: బూస శిరీష-రాజు
16వ వార్డు: బానోత్ నవీన్ నాయక్
24వ వార్డు: పెండెం శివానంద్
25వ వార్డు: నాడెం సునీత-శాంతి కుమార్
29వ వార్డు: నాగేల్లి పద్మ-వెంకటనారాయణ గౌడ్
30వ వార్డు: బండి ప్రవీణ్
ఈ జాబితా ప్రకటన స్థానికంగా విస్తృత చర్చనీయాంశంగా మారింది. మిగిలిన వార్డులకు సంబంధించిన జాబితాలను త్వరలో ప్రకటించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ అభ్యర్థుల ప్రచారం నిమిత్తం పార్టీ కార్యకర్తలు సిద్ధంగా వున్నామన్నారు.


